లాల్ సింగ్ చద్దా తెలుగు రైట్స్ కొనేసిన అల్లు అరవింద్.. మెగా సూపర్ ప్లాన్..!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దా సినిమా భారీ అంచనాలతో ఆగష్టు 11న రిలీజ్ కాబోతుంది.

అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే సినిమాపై ఓ రేంజ్ లో బజ్ ఏర్పాటు చేయగా ఈ మూవీకి తెలుగులో కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది అది ఎందుకు అంటే లాల్ సింగ్ చద్దా సినిమాలో అక్కినేని హీరో నాగ చైతన్య నటిస్తున్నాడు.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాగ చైతన్య కెరియర్ లో మొదటిసారి బాలీవుడ్ అటెంప్ట్ చేస్తున్నారు.ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ ఫ్రెండ్ పాత్రలో నాగ చైతన్య నటించారు.

సినిమాలో చైతు రోల్ కూడా స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.సినిమాలో కరీనా కపూర్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.

నాగ చైతన్య నటిస్తున్న కారణంగా లాల్ సింగ్ చద్దా సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.లాల్ సింగ్ చద్దా సినిమా తెలుగులో మంచి మార్కెట్ చేసింది.

Advertisement

ఈ మూవీ తెలుగు రైట్స్ ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తీసుకున్నారు.అల్లు అరవింద్ ఈ సినిమాపై భారీగా ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.

తెలుగులో కూడా ఈ సినిమాను భారీ రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారట.ఆమీర్ ఖాన్ ఫ్యాన్స్ తెలుగులో కూడా ఉన్నారు.లాల్ సింగ్ చద్దా సినిమా తెలుగు వర్షన్ తప్పకుండా తెలుగు ఆడియెన్స్ ని అలరించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

సినిమాలో ఆమీర్ ఖాన్, నాగ చైతన్యల మధ్య సీన్స్ స్పెషల్ గా ఉంటాయని అంటున్నారు.అల్లు అరవింద్ కొన్నారంటే మాత్రం లాల్ సింగ్ చద్దా సినిమాకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పొచ్చు.

 తెలుగు సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటుతున్న ఈ టైం లో హిందీ సినిమాని తెలుగు ఆడియెన్స్ ముందుకు తెస్తున్నారు.మరి ఈ మెగా సూపర్ ప్లాన్ ఎలా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు