శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ వెబ్సైట్ లను నమ్మొద్దు అంటూ..?

టీటీడీ( TTD ) భక్తులకు అలర్ట్ కేటుగాళ్లు నకిలీ వెబ్సైట్( fake website ) లో మోసానికి పాల్పడుతున్నారు.

అయితే అలాంటి నకిలీ వెబ్సైట్ లను గుర్తించిన టీటీడీ ఐటి విభాగం తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇలాంటి వెబ్సైట్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.అయితే అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ అని https://tirupatibalaji-ap-gov.org/ అనేది ఫేక్ వెబ్సైట్ అని వారు స్పష్టంగా చెప్పారు.అధికారిక వెబ్సైట్ లాగే కొన్ని మార్పులు చేసి ఫేక్ వెబ్సైట్ లో క్రియేట్ చేశారని టీటీడీ అధికారులు( TTD officials ) తెలిపారు.టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్ కూడా నకిలీ వెబ్సైట్ పై విచారణ చేసింది.

ఇప్పటికి మొత్తం 40 నకిలీ వెబ్సైట్ ల పై కేసులను నమోదు అయ్యాయి.ఇప్పుడు 41వ ఫేక్ వెబ్సైట్ ను గుర్తించడం జరిగింది.దాదాపు టీటీడీ అధికారిక వెబ్సైట్ ను పోలిన నకిలీ వెబ్సైట్ లను అక్రమార్కులు స్వల్ప మార్పులతో రూపొందించారని చెప్పారు.

Alert To Srivari Devotees Dont Trust Those Websites , Srivari Devotees , Fake

అయితే తిరుమల శ్రీ వారి భక్తులు ఇలాంటి మోసాల భారిన పడకూడదు అని టిటిడి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఆన్లైన్ లో టికెట్లను బుక్ చేసుకునే ముందు సరైన వెబ్సైటు ఏదో ఆధారాలను చెక్ చేసుకుని జాగ్రత్త పడాలని టీటీడీ అధికారులు సూచించారు.అలాగే టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు.

Alert To Srivari Devotees Dont Trust Those Websites , Srivari Devotees , Fake
Advertisement
Alert To Srivari Devotees Don't Trust Those Websites , Srivari Devotees , Fake

ఇక భక్తుల రద్దీ పెరుగుతుండడంతో ఆదివారం పిఏసీ 1 సమీపంలో మరొక అన్న ప్రసాదం కౌంటర్ ను టీటీడీ ప్రారంభించడం జరిగింది.అయితే ఆదివారం నాడు పూజలో అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీని ప్రారంభించడం జరిగింది.ఇక ప్రతిరోజు ఉదయం 10:30 నుండి రాత్రి 9:30 వరకు అన్న ప్రసాదం పంపిణీ చేయనున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్17, గురువారం 2025
Advertisement

తాజా వార్తలు