నా కూతుర్ల కోసం పోరాటం చేయాల్సి వస్తోంది.. ఎమోషనల్ అయినా తారకరత్న వైఫ్!

నందమూరి తారకరత్న ( Taraka Ratna ) భార్య అలేఖ్య రెడ్డి ( Alekhya Reddy ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు తారకరత్న మరణించిన తర్వాత ఈమె కుటుంబ బాధ్యతలను తీసుకున్నారు అలాగే తన భర్త పిల్లలతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈమె తరచు ఎమోషనల్ పోస్టులు చేస్తూ ఉన్నారు.

అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుతం కలకత్తా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన పట్ల తీవ్రస్థాయిలో ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.

ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీలు కూడా ఈ ఘటనపై స్పందిస్తున్నారు.

ఇలా ఒక ట్రైనీ డాక్టర్ ( Trainy Doctor )పట్ల దారుణంగా వ్యవహరించిన నిందితులకు కఠినంగా శిక్ష పడాలి అంటూ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ ఘటనపై నందమూరి అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.నేనెప్పుడూ నా కోసం నిలబడలేదు.

నా హక్కుల కోసం పోరాటం చేయలేదు కానీ మొదటిసారి నా కూతుర్ల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తోంది.నా కూతుర్ల రేపటి భవిష్యత్తు కోసం నేను గళం విప్పుతున్నాను.

Advertisement

ఇటీవల సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు.రేపిస్టులకు ఉరిశిక్ష విధించడం మన చట్టం.ఇలాంటి సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడకపోతే కనీసం వాటి గురించి మాట్లాడండి.

సరైన విషయంపై మీరు ధైర్యంగా మాట్లాడటం బెటర్.ఆ పని నేను చేస్తున్నాను.

మరి మీరు చేయగలరా అంటూ ఈమె ప్రశ్నిస్తూ చేసినటువంటి ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక ఈ పోస్ట్ పట్ల ఎంతోమంది నందమూరి తారకరత్న అలేఖ్య అభిమానులు ఈమెకు మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు