కాంగ్రెస్ లో చేరనున్న అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జోగులాంబ గద్వాల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ కు షాక్ తగిలింది.

అలంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పార్టీని వీడేందుకు సిద్ధం అయ్యారు.

బీఆర్ఎస్ ను వీడనున్న అబ్రహం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరనున్నారు.

అయితే అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను తొలుత బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది.కానీ అనూహ్యంగా అభ్యర్థిని మార్చిన బీఆర్ఎస్ నాయకత్వం అబ్రహం స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఇచ్చింది.

దీంతో పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అబ్రహం పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు