నైజాంను హడలెత్తిస్తున్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం అల వైకుంఠపురములో ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమాలో బన్నీ స్టైల్‌తో అదరగొట్టగా త్రివిక్రమ్ తనదైన మార్క్‌తో అదరగొట్టాడు.కాగా ఈ సినిమా కలెక్షన్లు కూడా అంతే బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతున్నాయి.

ఈ సినిమాకు పోటీగా ఒక్కరోజు ముందే వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాను ఓవర్‌టేక్ చేసి మరీ ఈ సినిమా కలెక్షన్లు రాబడుతోంది.ఇప్పటికే ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండగా, నైజాం ప్రాంతంలో ఈ సినిమా కలెక్షన్లతో హడలెత్తిస్తోంది.ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా ఆదివారం నాటికి ఒక్క నైజాం ఏరియాలో రూ.40 కోట్ల మార్కును దాటి తన సత్తా చాటిందని తెలుస్తోంది.ఇంత భారీ కలెక్షన్లను నైజాం ఏరియాలో సాధించిన అతితక్కువ సినిమాల్లో అల వైకుంఠపురములో చిత్రం నిలిచింది.

ఈ సినిమా టోటల్ రన్‌లో ఎంత మొత్తం సాధిస్తుందనే చర్చ ప్రస్తుతం టాలీవుడ్‌లో సాగుతోంది.మరి త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అద్భుతంగా అందించిన విషయం తెలిసిందే.

Advertisement