అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.
గతంలో వరుస హిట్స్ తో దూసుకు పోయిన నాగ్ గత కొద్దీ రోజులుగా హిట్స్ అనేవి దక్కడం లేదు.
దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి సీనియర్ హీరోల్లో ముందు ఉండాలని తాతలాడుతున్నాడు.ఈ క్రమంలోనే నాగార్జున తన కొత్త సినిమాను ప్రకటించి పూర్తి చేసి ఆడియెన్స్ ముందుకు తీసుకువచ్చే పనిలో పడ్డారు.
నాగార్జున నా సామిరంగ ( Naa Saami Ranga ) అనే సినిమాను ఈ మధ్యనే అనౌన్స్ చేయడం అయ్యింది అలాగే దానిని ఫైనల్ స్టేజ్ కు కూడా తీసుకు రావడం అయ్యింది.ఫాస్ట్ గా షూటింగ్ ఫినిష్ చేశారు.
ఎందుకంటే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ముందుగానే ప్రకటించారు.మరి అన్నట్టుగానే ఈ సినిమా షూట్ ఆల్మోస్ట్ పూర్తి చేయగా మిగిలిన భాగం ఇప్పుడు షూట్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ అని చెప్పారు కానీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.
కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఒక అప్డేట్ తెలుస్తుంది.ఇప్పటికే ఈ సీజన్ లో జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు, 13న ఈగల్, సైంధవ్ సినిమాలు వస్తున్నాయి.
మరి వీటి కంటే ముందే నాగార్జున తన సినిమాను రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నట్టు టాక్.
నాగార్జున అందరి కంటే ముందుగానే జనవరి 10 లేదంటే 11న వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.చూడాలి మరి ముందు వస్తే నాగ్ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో.కాగా విజయ్ బన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఇక ఆషికా రంగనాథ్ ( Ashika Ranganath ) హీరోయిన్ గా నటిస్తున్నట్టు టాక్.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy