ఆ పని చేసి రేణు దేశాయ్ కి షాక్ ఇచ్చిన అకీరా...

మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీ కి వచ్చిన పవన్( Pawan kalyan ) ఈరోజు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు.

నిజానికి అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటే పవన్ కి మాత్రం భక్తులు ఉంటారు.

ఎందుకంటే ఆయనను ఆయన ఫ్యాన్స్ దేవుడిలా భావిస్తారు.ఇక పవన్ తన రెండో భార్య రేణు దేశాయ్ ( Renu Desai )తో విడిపోయినా కూడా వదినా అంటూ ఆమెకు చాలా మంది మెసేజ్ లు పెడుతూ ఉంటారు.

ఇక ఎక్కవగా పవన్ కుమారుడు అకీరా గురించి కూడా అడుగుతూ ఉంటారు.ఇక అకీరా ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ విషయంపై పవన్ కానీ రేణు దేశాయ్ కానీ స్పందించడం లేదు.అయితే అప్పుడప్పుడు రేణు తన ముద్దుల కుమారుడు అకీరా విశేషాలను మాత్రం సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.

Advertisement

కొన్ని సార్లు ఫోటోలు షేర్ చేయడం మరి కొన్ని సార్లు కుమారుడు సాధించిన ఘనతలను పంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది.తాజాగా తన ఫోటోలను ఆమె షేర్ చేశారు.

అందులో రేణు చాలా అందంగా కనపడింది.

అయితే అవి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) ద్వారా మాడిఫై చేసిన ఫోటోలు కావడం విశేషం.ఈ మధ్యకాలంలో చాలా మంది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా రకాల మ్యాజిక్ లు చేస్తున్నారు.టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఫోటోలను కూడా కొందరు అలానే చేశారు.

అయితే ఇప్పుడు అకీరా కూడా తన తల్లి ఫోటోలను విభిన్న ఆకారాల్లో చాలా అందంగా తయారు చేయడం గమనార్హం.ఈ విషయాన్ని తెలియజేస్తూ రేణు ఈ ఫోటోలను షేర్ చేసింది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

కాగా ఈ ఫోటోల్లో రేణు చాలా అందంగా కనిపించింది.

Advertisement

దీంతో ఫ్యాన్స్ ఈ ఫోటోలు బాగున్నాయని చాలా అందగా ఉన్నారు అని కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.రేణు దేశాయ్ చాలా కాలం తరువాత సినిమా ఇండస్ట్రీలో నటిగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది.ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చలో దశలో ఉన్నాయి.ఇక మొత్తానికి రేణు అటు సినిమాలు చేస్తూ, ఇటు పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.

తాజా వార్తలు