ఈసారి ఎలా అయిన సరే గెలవాల్సిందే.. టైటిల్ కోసం స్నేహితుడుకు వెన్నుపోటు?

తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రసవత్తరంగా సాగుతోంది.17 మంది కంటెస్టెంట్ లతో మొదలైన ఈ షోలో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు.

ఇకపోతే గత రెండు రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో యుద్ధవాతావరణం నెలకొంది.

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఆడ మగ అని తేడా లేకుండా ఒకరిపై ఒకరు పడుతూ ఒళ్ళు హూనం చేసుకుంటున్నారు. బిందు అజయ్ అనిల్ కూర్చొని బాబా భాస్కర్ గురించి మాట్లాడుతూ బాబా భాస్కర్ గట్టిగా ఒక వారం లేదా రెండు వారాలు ఉండవచ్చు, గేమ్ ని డివియేట్ చేయడానికి వచ్చారని బిందు మాధవి అనగా అప్పుడు అనిల్ అందుకే సంచాలక్ గా ఆయన్ని పెట్టారంటె గేమ్ అర్థం చేసుకోవచ్చు అని అన్నాడు.

వెంటనే బిందుమాధవి బాబా భాస్కర్ కెప్టెన్ గా చూడాలని అనుకుంటున్నాను అని చెప్పింది.ఇకపోతే ఈవారం యాక్టివిటీ లో భాగంగా మీ అభిప్రాయంలో మీరు ఆధారపడని బ్యాక్ స్టెప్ చేసే ఆ ఒక్క వ్యక్తి ఎవరు? ఏ ఒక్కరు మిమ్మల్ని సేవ్ చేస్తారని కోరాడు బిగ్ బాస్.ఈ క్రమంలోనే మొదట అషు రెడ్డి, అరియానా పేరు చెప్తూ బ్యాక్ స్టెప్ ట్యాగ్ ఇచ్చింది.

నటరాజ్ మాస్టర్ సేవ్ చేస్తారనే నమ్మకంతో సేవ్ ట్యాగ్ ఇవ్వడంతో వెంటనే నటరాజు మాస్టర్ సేవ్ ట్యాగ్ ఇచ్చేసాడు.ఇకపోతే అఖిల్ ఈ యాక్టివిటి లో బిందు మాధవి కీ బ్యాక్ స్టెప్ ట్యాగ్ ఇచ్చాడు.

Advertisement

అయితే ఇప్పటి వరకు అఖిల్ గ్రూప్ గ్రూప్ అన్నట్టుగా గేమ్ ఆడిన అఖిల్ ఈ యాక్టివిటీ టాస్క్ లో తనకి హౌస్ లో ఎవరు లేరు అలాంటి ఎవరితో లేదు అన్న విధంగా మాట్లాడాడు.

అంతే కాకుండా అటువంటి ఫీలింగ్ ఇప్పటివరకూ నాకు రాలేదు అని అందుకే సేవ్ ట్యాగ్ ఎవరికి ఇవ్వను అని తెలిపాడు.టాస్క్ కంప్లీట్ చేయాలని ఎవరికో ఒకరికి ట్యాగ్ ఇవ్వాలి అనే బిగ్ బాస్ చెప్పడంతో వెంటనే మిత్రశర్మ సేవ్ ట్యాగ్ ఇచ్చేసాడు అఖిల్.మొత్తానికి అఖిల్ ఈ యాక్టివిటీ టాస్క్ లో తనకి ఎంత క్లోజ్ గా ఉంటున్న అజయ్ ని దూరం పెట్టి తనకు ఎవరూ లేరు అన్న విధంగా మాట్లాడాడు.

ఇన్ని రోజుల పాటు అజయ్ అఖిల్ కోసమే స్టాండ్ తీసుకోవడంతో పాటు, అఖిల్ ఎలా చెప్తే అలా గేమ్ ఆడాడు అజయ్.అంతేకాకుండా అఖిల్ కోసం బిందుమాధవి తో అనేక సందర్భాల్లో గొడవ కూడా పడ్డాడు.

అలాంటిది ఈ టాస్క్ లో భాగంగా అఖిల్ ఎవరితో బాండింగ్ లేదు అని ప్లేటు ఫిరాయించడంతో అజయ్ ముఖం అదోలా పెట్టేసాడు.అఖిల్, అజయ్ న దూరం పెట్టగా వెంటనే బిందుమాధవి అజయ్ కి సేవ్ ట్యాగ్ ఇచ్చింది.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు