సంక్రాంతి వార్.. ఒకేరోజు బరిలో దిగనున్న అజిత్-విజయ్.. విన్ అయ్యేది ఎవరో!

మన ఇండియన్ సినిమాల దగ్గర పండుగలు వస్తే చాలు.బాక్సాఫీస్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తుంది.

ప్రతీ పండుగకు వరుసగా సినిమాలను రంగంలోకి దించేందుకు మేకర్స్ రెడీ అవుతూ ఉంటారు.ఇక మన సౌత్ ఇండియాలో సంక్రాంతి అంటే పెద్ద పండుగ అనే చెప్పాలి.

మరి పొంగల్ రేస్ ను స్టార్ హీరోలు అంత త్వరగా వదులుతారా.అస్సలు మిస్ చేసుకోరు.

మరి ఈసారి టాలీవుడ్ లో మాత్రమే కాదు.కోలీవుడ్ లో కూడా భారీ పోటీ నెలకొనబోతుంది.

Advertisement

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పోటీ పడబోతుండగా.తమిళ్ లో విజయ్ దళపతి, అజిత్ కుమార్ పోటీ పడనున్నారు.

అయితే చిరంజీవి, బాలయ్య అయినా ఒకరోజు గ్యాప్ తో బరిలోకి దిగుతున్నారు.కానీ అజిత్, విజయ్ మాత్రం ఒకేరోజు బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు.

తాజాగా వీరిద్దరూ కూడా తమ సినిమాల రిలీజ్ డేట్ లను ప్రకటించారు.సంక్రాంతి కానుకగా జనవరి 11న ఇద్దరు తమ సినిమాలతో వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్ దళపతి హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా జనవరి 11న రాబోతున్నట్టు అఫిషియల్ గా మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు.ఇక హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తునివు సినిమాతో అజిత్ కుమార్ కూడా జనవరి 11నే వచ్చేందుకు సిద్ధం అయినట్టు మేకర్స్ రిలీజ్ డేట్ తో కన్ఫర్మ్ చేసేసారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

దీంతో ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే రెండు సినిమాల నుండి ట్రైలర్స్ వచ్చి మంచి అంచనాలు క్రియేట్ చేసాయి.మరి ఈ పొంగల్ బరిలో కోలీవుడ్ హీరోలు ఎవరు విన్ అవుతారో వేచి చూడాల్సిందే.

Advertisement