7 లక్షలతో అజిత్ కటౌట్..!

కోలీవుడ్ హీరో అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే.ప్రస్తుతం అజిత్ తునివు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కోసం తమిళనాడులో అజిత్ ఫ్యాన్స్ అంతా సూపర్ జోష్ కనబరుస్తున్నారు.అయితే కేవలం తమిళనాడులోనే కాదు కేరళలో కూడా అజిత్ ఫ్యాన్స్ హంగామా కొనసాగుతుంది.

అజిత్ ఫ్యాన్ ఒకరు ఏకంగా 7 లక్షలు ఖర్చు పెట్టి 120 అడుగుల అజిత్ ఫ్లెక్స్ ను ఏర్పాటు చేశారు.ఇంత ఎత్తైన ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.

Ajith Fan 7 Lakhs Cutout For Tunivu Release , Ajith Fan 7 Lakhs Cutout,ajith ,ko

దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.స్టార్ హీరోల ఫ్యాన్స్ వారి మీద అభిమానం చూపించేందుకు ఎంత ఖర్చుకైనా వెనకడుగు వేయరు.ఈ క్రమంలో చాలామంది స్టార్ హీరోల కోసం తమ పాకెట్ మనీ భారీగా ఖర్చు పెట్టేస్తుంటారు ఫ్యాన్స్.

Advertisement
Ajith Fan 7 Lakhs Cutout For Tunivu Release , Ajith Fan 7 Lakhs Cutout,ajith ,Ko

అజిత్ కోసం 7 లక్షలతో కటౌట్ ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచాడు కేరళకు చెందిన అజిత్ ఫ్యాన్.ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి అజిత్ కు చేరుతుందని చెప్పొచ్చు.

వీరాభిమానిని అజిత్ కలిసే అవకాశం కూడా ఉంది.

Advertisement

తాజా వార్తలు