ఆర్ ఎక్స్ 100 సినిమా ( RX 100 movie ) ప్రతీ ఒక్కరు చూసే ఉంటారు.
మరి అలాంటి సినిమాతో అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం అందుకున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి.
ఈ డైరెక్టర్ అప్పటి నుండి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమాతో బోల్డ్ లవ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసాడు.
అయితే ఈ సినిమా విజయం తర్వాత ఈ డైరెక్టర్ కు మరో హిట్ పడలేదు.
మహాసముద్రం అంటూ మరో సినిమాతో రాగా ఇది ప్లాప్ అయ్యింది.అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో కాస్త ఢీలా పడ్డాడు.కానీ తన ప్రయత్నం ఆపకుండా మరోసారి ప్రేక్షకుల ముందుకు మంగళవారం( Mangalavaaram ) సినిమాతో రాబోతున్నాడు.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి.సౌత్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయనున్న ఈ సినిమా నవంబర్ 17న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
దీంతో ఈ సినిమాపై చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.ముందు నుండి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమా రిలీజ్ కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.
దీంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు.తాజాగా ఈ సినిమా బడ్జెట్ గురించి డైరెక్టర్ అజయ్ క్లారిటీ ఇచ్చేసారు.ఈ సినిమాకు దాదాపు 20 కోట్ల బడ్జెట్ ను పెట్టినట్టు తెలిపారు.
ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ లేదు కాబట్టి ఇది ఎక్కువ బడ్జెట్ అనే చెప్పాలి.మరి ఇంత బడ్జెట్ ను అజయ్ భూపతి తన టీమ్ తో కలిసి రాబడుతారో లేదో చూడాలి.
కాగా ఈ సినిమాలో పాయల్ రాజపుత్ ( Payal Rajput ) ప్రధాన పాత్రలో నటించింది.ఆర్ఎక్స్ 100 కాంబోను రిపీట్ చేస్తున్నట్టే ఆ హిట్ ను కూడా రిపీట్ చేస్తారో లేదో చూడాలి.
ఇక ఈ సినిమాకు కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్( Ajanish Loknath ) సంగీతం అందిస్తుండగా మధుర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy