ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్.. రీచార్జ్ లో 50% డిస్కౌంట్..!

ఎయిర్ టెల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.కేవలం మొబైల్ రీఛార్జ్ తో క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్, రీఛార్జ్ లో 50% క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందుబాటు లోకి తెచ్చింది.ఇక ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనేది డిజిటల్ బ్యాంక్ అని అందరికీ తెలిసిందే.

దీనికి బ్రాంచులు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు.కేవలం టచ్ పాయింట్లు ఉన్నాయి.ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లో అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు డిపాజిట్ చేసుకుంటే దాదాపుగా 2.5% వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.

ఇక అసలు విషయానికి వస్తే మొదటి సారి ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి రీఛార్జ్ చేసుకుంటే 50 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.రెండవసారి రీఛార్జ్ చేసుకుంటే గరిష్టంగా రూ.50 క్యాష్ బ్యాక్ పొందవచ్చు.రూ.839, రూ.719, రూ.299, రూ.265 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే రూ.30 క్యాష్ బ్యాక్ పొందవచ్చు.రీఛార్జ్ చేసుకునే ప్లాన్లను బట్టి రూ.50 నుంచి రూ.10 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది.అంతే కాకుండా ట్రైన్ టికెట్లపై రూ.100 , గ్యాస్ సిలిండర్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు లపై రూ.20 ల క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంది.

Advertisement

ఇంకా ఎయిర్ టెల్ యూపీఐ ద్వారా కనుక ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే, ఫ్లాట్ రూ.60 తగ్గింపు అందుబాటులో ఉంటుంది.చూశారుగా ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ నుండి ఎన్ని విధాలుగా క్యాష్ బ్యాక్ పొందవచ్చో.

క్యాష్ బ్యాక్ ఆఫర్లను పొందాలి అనుకుంటే ఈ యాప్ ను ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకొని, ఎయిర్ టెల్ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోండి.

Advertisement

తాజా వార్తలు