వ్యాక్సిన్ కోసం పైలట్ల డిమాండ్.. విమానాలు నడపమంటున్న పైలట్ల సంఘం..!

కరోనా సెకండ్ వేవ్ విజృంభన ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే.

కరోనా బారిన పడి కోలుకుంటున్న వారితో పాటుగా మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది.

ఇలాంటి టైం లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వేగవంతం చేస్తే అంత మంచిదని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి.అయితే వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతున్నా కేసులు మాత్రం రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి.

ఇక ఈ క్రమంలో తమకు వ్యాక్సిన్ కావాలని కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.వారిలో ప్రధానంగా ఎయిర్ ఇండియా పైలట్లు తమకు వ్యాక్సిన్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

తమకు వ్యాక్సినేషన్ నిర్వహించకపోతే తాము విమానాలు నడపమని ఎయిర్ ఇండియా పైలట్ల సంఘం (ఐసీసీఏ) హెచ్చరించింది.వ్యాక్సిన్ క్యాంపులను నిర్వహించి తమకు వ్యాక్సిన్ ప్రక్రియ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Advertisement

పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురికి పైలట్ల సంఘం లేఖ రాశారు.పాండమిక్ టైం లో తమ సేవలను గుర్తించాలని వారు కోరారు.

అంతేకాదు నెలవారి జీతాలు అంతకుముందు లానే ఇవ్వాలని కోరారు.వేతనాల్లో కోతలు చాలాకాలంగా సాగుతుందని పైలట్లు ఆందోళన వ్యక్తం చేశారు.

పైలట్లని కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించాలని వారు కోరారు.వ్యాక్సినేషన్ ప్రక్రియ మాకు ఎందుకు నిర్వహించడం లేదో తెలపాలని అన్నారు.

అనేకమంది ప్రయాణీకులు విమానాల్లో ఎక్కుతుంటారని తక్షణమే తమకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎయిర్ ఇండియా పైలట్లు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు