ఏఐ దెబ్బకి ఠా, దొంగలముఠా... సిమ్ కార్డు మోసాలు బట్టబయలు!

టక్నాలజీ రంగంలో ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్)( Artificial Intelligence ) కొత్త పుంతలు తొక్కుతోంది.వివిధ రంగాల్లో తన సత్తాని ఈ ప్రపంచానికి చాటుతోంది.

ఎంతలా అంటే జనాలు టెన్షన్ పడేంత.అవును, ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏఐ తమకు ఎక్కడ ఎసరు పెడుతుందోని తగ భయపడుతున్న పరిస్థితి.

అయితే మీరు ఇప్పటివరకు దానివలన జరిగే నష్టాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.ఇపుడు చెప్పబోయే విషయం తెలిస్తే మీరు దాని వలన కలిగే ఉపయోగాలు గురించి ఆలోచించడం మొదలు పెడతారు.

Ai Has Been Defeated Gang Of Thieves Sim Card Frauds Exposed

విషయం ఏమిటంటే, భారతదేశం అంతటా ఉన్న మొత్తం సిమ్ కార్డు హోల్డర్స్ వెరిఫికేషన్ ను చేసేందుకు DOT (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం) తీసుకువచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సిస్టమ్ ASTR అనేక అక్రమాలను అరికడుతుందని చెప్పుకోవాలి.రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలు యావత్ దేశాన్ని నివ్వెర పరిచేలా చేశాయి అంటే మీరు నమ్ముతారా? వీరు ఇప్పటికే నకిలీ పత్రాలతో సిమ్ కార్డులను వాడుతున్న చాలా కేసులను పట్టుకున్నారు.ఇందులో, గుజరాత్ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడుకు చెందిన కేసులు కూడా ఉన్నాయని మీకు తెలుసా?

Ai Has Been Defeated Gang Of Thieves Sim Card Frauds Exposed
Advertisement
Ai Has Been Defeated Gang Of Thieves Sim Card Frauds Exposed-ఏఐ దెబ�

ASTR అంటే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫెషియల్ రికగ్నైజేషన్ పవర్డ్ సొల్యూషన్ ఆఫ్ టెలికాం సిమ్ సబ్ స్క్రైబర్ వెరిఫికేషన్ అని అర్ధం.ఇది ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ద్వారా సిమ్ కార్డ్ యూజర్ల వివరాలను మరియు ఫోటోలను క్షణాల్లో వెరిఫై చేసేస్తుంది.ఈ క్రమంలోనే రీసెంట్ గా తమిళనాడులో ఒకే ఆధార్ కార్డ్ పైన 100 పైగా సిమ్ కార్డ్స్ ఉపయోగిస్తున్న వారిని గుర్తించి వారి సిమ్ కార్డ్స్ ను బ్లాక్ చేసింది.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన వ్యక్తి ఇదే రకంగా అత్యధికమైన సిమ్ కార్డ్స్ వాడడంతో కేసు నమోదయ్యింది.సదరు వ్యక్తి ఒకే ఫోటో ప్రూఫ్ తో ఏకంగా 658 సిమ్ కార్డ్ లను తీసుకున్నట్లు ASTR గుర్తించడం కొసమెరుపు.

ఒకవేళ మీకు కూడా మీ సిమ్ కార్డ్ లేదా మీ మొబైల్ నెంబర్ గురించి సందేహం ఉంటే, మీరు సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు.ఈ tafcop వెబ్సైట్ ను సంధర్శించి మీ మొబైల్ నంబర్ ను మరియు మీ పేరు ఉన్న అన్ని మొబైల్ నంబర్లను కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.

30 ఏళ్లకే ముసలివారిలా కనిపిస్తున్నారా.. యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు