చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం తీర్పు

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం తీర్పును వెలువరించనుంది.ఈ మేరకు మధ్యాహ్నం 2.

15 గంటలకు న్యాయస్థానం తీర్పును ప్రకటించనుంది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై ఇప్పటికే చంద్రబాబు, సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.కాగా ఇవాళ హైకోర్టు వెలువరించనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు