ఏపీ సీఎం జగన్‎తో సలహాదారు సజ్జల భేటీ..!

ఏపీ సీఎం జగన్ తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు.

తాజాగా నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో ఇరువురి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

కాగా, తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ మరోసారి కోటంరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కోటంరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం తీవ్రంగా మండిపడుతోంది.

గతంలో మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ పార్టీపై ఆరోపణలు చేసారు.దీంతో రంగంలోకి దిగిన పార్టీ అధిష్టానం నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ నియామకంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement