డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'సలార్' బుకింగ్స్ మొదలయ్యేది ఎప్పుడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) లైనప్ లో కీలకమైన ప్రాజెక్ట్ ఉన్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఏది అంటే సలార్.

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.

కేజిఎఫ్ సిరీస్ తో నీల్ ( Prashanth Neel )ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవ్వడంతో సలార్ సినిమాకు నీల్ పాపులారిటీ కూడా తోడయ్యింది.మేకర్స్ క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ పై అఫిషియల్ గా అప్డేట్ తెలిపారు.ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల ఒక్క ఇండియాలోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా సెన్సేషనల్ హైప్ నెలకొంది.

Advertisement

యుఎస్ లో మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేయగా తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ పై మళ్ళీ సాలిడ్ అప్డేట్ ను అందించారు.నార్త్ అమెరికాలో ఈ నవంబర్ 20 నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నట్టు క్రేజీ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు.మరి ఈ న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.

Advertisement

తాజా వార్తలు