ఆ నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. !

రాష్ట్రంలో కరోనా జైత్రయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది.ఇన్ని ప్రాణాలు తీసుకుపోవాలని, ఇంత మందిని పట్టి పీడించాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా ఉంది కావచ్చూ.

అందుకే ఎక్కడా తగ్గకుండా ఎక్కువైనా ఫర్వాలేదంటూ ముందుకు దూసుకు వెళ్లుతుంది.భారతీయుల సహనానికి, రోగ నిరోధక శక్తికి సవాల్‌గా మారింది.

Adoni Ycp Mla Sai Prasad Reddy Tests Corona Positive , Kurnool, Adoni, YCP MLA,

అదిగాక ఈ సెకండ్ వేవ్ మరీ ముచ్చట పడుతూ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రముఖులు, సెలబ్రెటీలతో పాటుగా, సామాన్య ప్రజలను కూడా పెద్ద సంఖ్యలో తన ఖాతాలో వేసుకుంటుంది.అదీగాక ఏమాత్రం ఆరోగ్యం సహకరించకున్న ప్రాణాలను చీమలను నలిపినట్లుగా నలిపేస్తుంది.

ఇదిలా ఉండగా ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు.ఆదోని ఎమ్మెల్యే అయిన సాయిప్రసాద్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం.

Advertisement

ఇకపోతే ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారందరు టెస్ట్ లు చేయించుకోండి.మాస్క్ ధరించండి.

కరోనాను జయించాలంటే భౌతిక దూరం పాటించండని సన్నిహితులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు