ఆ వైసీపీ నేతతో పెళ్లంటూ జరిగిన ప్రచారంపై శ్రీరెడ్డి క్లారిటీ.. ఏం చెప్పారంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు వివాదస్పద నటి శ్రీ రెడ్డి ( Actress Sri Reddy )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రావర్సిల ద్వారా బాగా పాపులర్ అయ్యింది.

తరచూ ఏదో ఒక కాంట్రవర్శి లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.సినిమాలకు రాజకీయాలకు సంబందించిన విషయాల్లో తల దురుస్తూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా ట్వీట్స్,సంచలనం కామెంట్స్ చేస్తూ ఉంటుంది.

ఆ సంగతి పక్కన పెడితే ఐదేళ్ల కిందట.కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ( Byreddy Siddharth Reddy )గురించి శ్రీరెడ్డి ఒక పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.

బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి ఒక్క రోజు పెళ్లంగా ఉంటే చాలు.ఆ తరువాత చచ్చినా పర్లేదు.

Advertisement

నువ్వు మగాడివిరా బుజ్జీ అంటూ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి.

ఆ తరువాత పలు సందర్భాల్లో శ్రీరెడ్డి.బైరెడ్డి లాంటి మొగుడు రావాలని కొంటె కామెంట్లు చేసేది.అయితే ఇప్పుడు ఎన్నికల తరువాత ట్రోలర్స్‌కి ఇదే అస్త్రంగా మారింది.2024 ఎన్నికల్లో వైసీపీ( YCP ) ఘోర పరాజయం తరువాత ఆ పార్టీకి సపోర్ట్ చేసిన శ్రీరెడ్డిపై ట్రోలింగ్ మొదలు పెట్టేసారు.శ్రీరెడ్డి కూడా ధీటుగానే కౌంటర్లు ఇస్తుంది కానీ.

తాజాగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకుంటున్నారు.

గత రెండేళ్లుగా వీళ్లు రిలేషన్‌లో ఉన్నారు అంటూ.బైరెడ్డి, శ్రీరెడ్డి ఫొటోలను మార్ఫింగ్ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు టీడీపీ-జనసేన సపోర్టర్స్.

వీడియో: దూడ పుట్టిందని పోలీసులను పిలిచిన రైతు.. ఎందుకో తెలిస్తే...??
ప్రధాని మోడీకి పెళ్లి ఆహ్వానం అందించిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఫోటో వైరల్!

ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో శ్రీరెడ్డి స్పందించింది.రాజకీయంగా తనపై విమర్శలు చేస్తే చేయండి కానీ.

Advertisement

ఇలాంటి లేనిపోని ఫేక్ ప్రచారాలతో బైరెడ్డి లాంటి యువ నాయకుడి జీవితాన్ని నాశనం చేయొద్దని ఆమె కోరింది.

తాజా వీడియోలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.అంత ఖాళీగా ఉన్నారేంట్రా.ఏంటి ఆ మీమ్స్.

పనీ పాటా ఏం లేదా? ఏంటా మీమ్స్.మొన్నటి వరకూ బీచ్‌లో బట్టలూడదీసి తిరుగుతానన్నానని ఫేక్ ప్రచారాలు చేశారు.

ఎక్కడా నేను ఆ మాటే చెప్పలేదు.కానీ, ఇప్పుడు మళ్లీ ఒకటి మొదలెట్టారు.

ప్రతివాళ్లకీ నేనే హాట్ కేక్‌లా దొరుకుతాను.నేనేం అందగత్తెని కాదు.

నేను పెద్ద ఇదేం కాదు కానీ.అంతా నా మీద పడి ఏడుస్తారేంటో మరి అంటూ మండిపడింది శ్రీరెడ్డి.

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, నా గురించి ఫేక్ ప్రచారం చేస్తున్నారు.ఆ అబ్బాయి నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాం అని.నేనేదో సరదాకి.బైరెడ్డి బావుంటాడు, బైరెడ్డి లాంటి మొగుడొస్తే బాగుంటుంది అన్నాను.

కానీ.నిజంగా నేనుప్పుడూ బైరెడ్డిని చూడటం కానీ, అతడితో ఫోన్‌లో మాట్లాడటం కానీ చేయలేదు.

బైరెడ్డి ఎక్కడుంటాడనేది కూడా నాకు తెలియనే తెలియదు అని శ్రీరెడ్డి తెలిపింది.నా జీవితం గురించి నాకు భయం లేదూ.

బాధా లేదు.ఇలాంటివి వస్తే.

ఫ్యూచర్‌లో నాకు పెళ్లి కాదనే భయం కూడా లేదు.తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టు.

నా జీవితం అయ్యింది చాలు.ఇంకా అవ్వాల్సిందేమీ లేదు.

కానీ, బైరెడ్డికి జీవితం ఉంది.అతను చిన్నపిల్లోడు.

రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లోడు.నేను కొన్ని రోజులుగా వీడియోలు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.

ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం పాడుకాకూడదనే ఈ వీడియో చేస్తున్నాను.ఆడదానికైనా, మగాడికైనా జీవితం అంటే ఇంపార్టెంట్.

ఇలాంటి రూమర్స్ రాకూడదనే ఈ వీడియో చేస్తున్నాను.బైరెడ్డికి నాకు పెళ్లి సెట్ కావడాలు, రిలేషన్‌షిప్‌లో ఉండటం లాంటివి లేవు.

ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఆపండి అంటూ బైరెడ్డితో పెళ్లి రూమర్లను ఖండించింది శ్రీరెడ్డి.

తాజా వార్తలు