నటి సమంతకు స్వల్ప అస్వస్థత

సినీ నటి సమంత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.జ్వరంతో బాధపడుతున్నానంటూ సమంత ట్వీట్ చేశారు.

వరుస షూటింగ్స్, ప్రమోషన్స్ తో కొన్ని రోజులుగా ఆమె పుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.జ్వరంతో పాటు గొంతునొప్పితో ఇబ్బందిపడుతున్నట్లు సామ్ తెలిపింది.

అయితే భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య నిర్మితమైన శాకుంతలం ఈనెల 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే.గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శకుంతలగా, మలయాళీ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు.

ఇటీవల మయోసైటిస్ కు గురైన సామ్ ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

Advertisement
గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు