Prashanthi Harathi : వాళ్ల దృష్టిలో నేను ఇప్పటికీ సునీల్ పెళ్లాన్నే.. ప్రముఖ నటి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ప్రముఖ నటి ప్రశాంతి హారతి( Prashanthi Harathi ) గురించి మా అందరికీ తెలిసిందే.

తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది నటి ప్రశాంతి హారతి.

పెళ్లాం ఊరెళితే, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో ఫ్యామిలీతో సెటిల్ అయ్యింది.

తెలుగు సంస్కృతిని అక్కడి ప్రజలకు నేర్పిస్తోంది.

అభినయ కూచిపూడి అకాడెమీ స్థాపించి ఇండియన్ క్లాసికల్ డాన్స్ ల్లో విదేశీయులకు శిక్షణ ఇస్తోంది.కూచిపూడి, భారతనాట్య క్లాస్ లను నేర్పిస్తున్నారు.అమెరికా లోనే కాకుండా స్కాట్ లాండ్, ఇతర దేశాల్లోనూ మన సంస్కృతిని మరింతగా పరిచయం చేయడంలో కృషి చేస్తోంది.

Advertisement

ఆమె కూతురు తాన్య హారతి( Tanya harathi ) కూడా అదే ఫీల్డ్ లో ఉన్నారు.ఇక తెలుగు ప్రేక్షకులకు చాలా దూరమైన ప్రశాంతి హారతి తాజాగా ఒక ఇంటర్వ్యూతో తన గురించిన విషయాలను వెల్లడించింది.

ఈ క్రమంలో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వడం గురించి మాట్లాడుతూ కమెడియన్ సునీల్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.గతంలో పెళ్లాం ఊరెళితే( Pellam Oorelithe ) సినిమాలో నటించాను.సునీల్ కు వైఫ్ పాత్రలో నటించడం నాకు మంచి గుర్తింపును తెచ్చింది.

ఆడియెన్స్ దృష్టిలో నేనింకా సునీల్ పెళ్లాన్నే, అలాంటి డీసెంట్ పాత్రల్లో నటించేందుకు ముందుంటాను అని సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చింది.తెలుగులో మంచి మంచి సినిమా అవకాశాలు వస్తే ఇప్పటికీ తాను ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపింది.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు