ఘనంగా సీమంతం జరుపుకున్న నటి ప్రణీత.. ఫోటోలు వైరల్!

పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది చిత్రం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రణీత గురించి అందరికీ సుపరిచితమే.

అయితే పలు తెలుగు,కన్నడ హిందీ సినిమాలలో నటించిన ప్రణిత గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇలా తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి గత ఏడాది మే 30వ తేదీ కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహాన్ని జరుపుకున్నారు.ఇలా వివాహం అనంతరం తన పెళ్లి విషయాన్ని ప్రణీత వెల్లడించారు.

కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో తన పెళ్లి గురించి సంతోషంగా చెప్పడం భావ్యం కాదని భావించిన ఈమె తన పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ లేకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో తన వివాహాన్ని జరుపుకున్నారు.ఇకపోతే ఈమె పెళ్లి జరిగి ఏడాది కావస్తుండగా ప్రణీత తల్లి కాబోతున్న విషయాన్ని వెల్లడించారు.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం తన భర్త పుట్టినరోజు సందర్భంగా ఈమె తన ప్రెగ్నెన్సీ గురించి బయట పెట్టారు.

Advertisement

ఇక తన ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియ చేసిన తర్వాత నిత్యం తన బేబీ బంప్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఎంతో సందడి చేశారు.ఇకపోతే తాజాగా ప్రణీత తన సీమంత వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.పసుపు రంగు పట్టు చీరను ధరించి, ఎంతో అందంగా ముస్తాబై ప్రణీత తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సీమంతము వేడుకలను జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే తన సీమంతానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ క్రమంలోని ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి.ఇక ఈ ఫోటోలు చూసిన ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులు ఈమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు