Pavitra Lokesh: మార్ఫింగ్ ఫోటోలపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన పవిత్ర లోకేష్.. నెటిజన్స్ ట్రోల్స్!

తెలుగు సినీ ప్రేక్షకులకు సినీ నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

పవిత్ర లోకేష్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే హీరో హీరోయిన్ లకు మదర్ క్యారెక్టర్లలో ఎక్కువగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర లోకేష్ సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయింది అని చెప్పవచ్చు.మరి ముఖ్యంగా టాలీవుడ్ నటుడు నరేష్ విషయంలో ఈమె బాగా పాపులర్ అయ్యింది.

అంతేకాకుండా ఈమెపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ జరిగిన విషయం తెలిసిందే.నటి పవిత్ర లోకేష్ నటుడు నరేష్ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని అంతే కాకుండా త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే.

ఇదే విషయంపై నరేష్ మాజీ భార్య స్పందిస్తూ నటి పవిత్ర లోకేష్ గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ నానా రచ్చ చేసింది.ఇదే విషయంపై పవిత్ర లోకేష్, స్పందిస్తూ ఆ వార్తలన్నీ అవాస్తవాలే అంటూ కొట్టి పడేసిన విషయం తెలిసిందే.

Advertisement

కానీ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ఎప్పుడు కనిపించినా కూడా ఎక్కువ సందర్భాలలో ఇద్దరు కలిసి కనిపిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా నటి పవిత్ర లోకేష్ కి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే పవిత్ర తాజాగా పోలీసులను ఆశ్రయించింది.సీనియర్ నటుడు నరేష్ తన పట్ల కొన్ని వెబ్ సైట్లు యూట్యూబ్ ఛానల్ తప్పుడుగా ప్రచారం చేస్తున్నాయని ఆమె తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.అంతేకాకుండా తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతర కామెంట్లతో వాటిని వైరల్ చేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

సోషల్ మీడియాలో తమ ఇద్దరినీ ట్రోల్‌ చేస్తూ వస్తున్న వార్తల పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది.పవిత్ర ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు