పవన్ దమ్మున్న నాయకుడు... డిప్యూటీ సీఎం పై నటి సంచలన వ్యాఖ్యలు!

సినీ నటుడు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇటీవల జనసేన పార్టీ( Janasena Party ) ఆవిర్భావ సభలో భాగంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

పార్టీ స్థాపించినప్పటి నుంచి మొదటిసారి పవన్ కళ్యాణ్ మంచి ఉన్నత హోదాలో ఉన్న నేపథ్యంలో 12వ ఆవిర్భావ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ముఖ్యంగా హిందీ( Hindi ) భాష గురించి ఈయన మాట్లాడిన తీరు కొంతమందిని ఆకట్టుకోగా, మరి  కొంతమంది పవన్ తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు.

స్టాలిన్ ప్రభుత్వం హిందీ భాషను అడ్డుకుంటున్న తీరుపై పవన్ తీవ్రంగా మండి పడ్డారు.అదేవిధంగా రూపీ సింబల్ కూడా మార్చటాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు.హిందీ భాష మాత్రం వద్దు.

తమిళ లు మాత్రం హిందీలో డబ్ చేస్తారు.అక్కడి డబ్బులు మాత్రం మీకు కావాలి.

Advertisement

అక్కడి భాష  మాత్రం మీకు వద్ద అంటూ స్టాలిన్ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.హిందీ భాష గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఇదిలా ఉండగా ఈ సభలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా ( Meera Chopra ) స్పందించారు .ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ఫోటోని షేర్ చేస్తూ.పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడు.

కేవలం గట్స్ మాత్రమే కాదు.తెలివి, బుద్ది, జ్ఞానం ఉన్న నాయకుడు అంటూ డిప్యూటీ సీఎంపై ప్రశంశల వర్షం కురిపిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇక మీరా చోప్రా పవన్ కళ్యాణ్ తో కలిసి బంగారం సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయటంతో ఆయన వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా పవన్ పై ప్రశంసలు కురిపిస్తూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు