MadhuBala :ఆర్ఆర్ఆర్, బాహుబలి పై షాకింగ్ కామెంట్స్ చేసిన మధుబాల.. ఎలా హిట్ అయ్యాయో తెలియదంటూ?

నటి మధుబాల( MadhuBala ).దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన రోజా సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ.

మధుబాల అసలు పేరు మధు కాగా రోజా సినిమా తర్వాత ఆ పేరును మార్చుకుంది.ఆమె ఒట్టయల్ పట్టాలమ్‌ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో దాదాపుగా 50కి పైగా సినిమాలలో మధుబాల నటించింది.ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం సినిమాలో మేనక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 14న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మధుబాల శాకుంతలం( Shaakuntalam ) సినిమా గురించి స్పందించింది.ఈ సందర్బంగా మధుబాల మాట్లాడుతూ.

Advertisement

కష్టపడి పనిచేసినప్పటికీ శాకుంతలం విజయం సాధించకపోవడం ఎంతగానో బాధపెట్టింది.సినిమా పూర్తయిన తరువాత ఒక ఏడాది సీజీఐ కోసమే వర్క్‌ చేశారు.

ప్రేక్షకులకు మంచి విజువల్‌ ట్రీట్‌ ఇవ్వాలని అనుకున్నారు.షూటింగ్‌లో నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌పై ఎలాంటి ఒత్తిడి పెంచలేదు.

టాలీవుడ్ సినిమాలు బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ గొప్ప విజయాలు సాధించాయి.వాటి విజయాలకు సరైన కారణం అంటూ ఏదీ లేదు.అంతేకాకుండా ఆ మూవీస్ ఎలా హిట్ అయ్యాయో కూడా అర్ధం కావడం లేదు.

మా సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఇంతగా నిరాశ పరుస్తుందని మేం అసలు అనుకోలేదు అని తెలిపింది మధుబాల.కాగా శాకుంతలం సినిమాతో పాటు ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలపై మధుబాల చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రేమ వ్యవహారం విషాదాంతం..యువకుడి ఆత్మహత్య
రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు

ఇకపోతే శాకుంతలం సినిమా విషయానికి వస్తే. సమంత ప్రధానోపాత్రలో( Samantha ) నటించిన ఈ సినిమాలో దేవ్ మోహన్ హీరోగా నటించిన విజే తెలిసిందే.గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Advertisement

కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా ఆశించిన విధంగా సక్సెస్ కాలేకపోవడంతో పాటు నిర్మాతలకు బోలెడంత నష్టాన్ని కూడా మిగిల్చింది.

తాజా వార్తలు