వారి చిల్లర పనుల వల్ల ఫోటోలు పోస్ట్ చేయాలన్న కూడా భయం వేస్తోంది

సోషల్ మీడియా బాగా పెరిగి పోయింది.చిన్న విషయాలను కూడా పెద్దదిగా చేసి చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చాలా ఏళ్లుగా ఉన్న ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది.ఎందుకు అంటే కేవలం సోషల్ మీడియా ఎక్కువ అవ్వడమే.

తాజాగా ఆ విషయంపై నిన్నటి తరం హీరోయిన్ లయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Actress Laya About Netizens Comments In Social Media

కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి చోటా కూడా ఉంటుంది.కానీ సినిమా పరిశ్రమలో ఉన్న చెడును మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.సోషల్ మీడియాలో కొందరు తమ పబ్బం గడుపుకునేందుకు సెలెబ్రెటీలను విమర్శించడం, వారికి సంబంధించి కామెంట్స్ జరుగుతుందని చెప్పుకొంచింది.

Advertisement
Actress Laya About Netizens Comments In Social Media-వారి చిల్�

కొన్ని రోజుల క్రితం నేను ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడను.అందులో నా తెలుగు బాగా లేదని కామెంట్స్ చేశారు.

Actress Laya About Netizens Comments In Social Media

ప్రస్తుతం మీడియాలో ఉన్నవారు, ఇండస్ట్రీలో ఉన్నవారు ఎవరు కూడా తెలుగు సరిగా మాట్లాడలేరు.కానీ వారి గురించి అయితే మాట్లాడే దమ్ము ధైర్యం మాత్రం లేదు.సోషల్ మీడియాలో ఎం పోస్ట్ చేస్తే ఎలా వక్రీకరిస్తారో అర్థం కాని పరిస్థితి.

అందుకే తాను కనీసం నా ఫ్యామిలీ ఫోటోలను కూడా పోస్ట్ చేయడం లేదని చెప్పుకొచ్చింది.సోషల్ మీడియా అంటేనే భయం వేస్తోంది ఆందోళన వ్యక్తం చేసింది.యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే అసహ్యంగా అనిపిస్తుంది లయ చెప్పుకొచ్చింది.

అయితే లయ కామెంట్స్ కు నెటీజన్స్ ఆగ్రహంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఖాళీ కడుపుతో జ్యూస్ తాగుతున్నారా?... ఈ విషయాలు తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు