జ్యోతి రాయ్( Jyothi Rai ) అంటే టక్కను గుర్తుపట్టకపోవచ్చు కానీ జగతి మేడం అంటే మాత్రం అందరికీ ఈమె టక్కున గుర్తుకు వస్తారు.
కన్నడ సినీ నటిగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి ఈమె దాదాపు 20 సీరియల్స్ లో నటిగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి జ్యోతి తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్( Guppedantha Manasu ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సీరియల్లో జగతి (Jagathi) మేడం పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు.
ఎంతో సాంప్రదాయపద్ధంగా చీర కట్టుకొని చాలా పద్ధతిగా కనిపించే ఒక లెక్చరర్ పాత్రలో( Jagathi Madam ) నటించారు.ఇక ఈమె నటనకు ఎంతోమంది అభిమానులుగా మారిపోయారని చెప్పాలి.ప్రస్తుతం ఈ సీరియల్ నుంచి ఈమె పాత్రను తొలగించడంతో అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు.
కన్నతల్లి గురించి నిజం తెలుసుకొని తనపై ప్రేమ చూపిస్తున్నటువంటి తరుణంలోనే ఈమె పాత్రను చనిపోయినట్లు చూపిస్తూ సీరియల్ నుంచి తీసేయడంతో ఎంతోమంది అభిమానులు ఫీలవుతున్నారు.
ఇలా ఉన్నఫలంగా జగతి పాత్రను తొలగించడానికి కారణం లేకపోలేదు ఆమె ఇతర ప్రాజెక్ట్స్ కారణంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సీరియల్ నుంచి ఆమె పాత్రకు ఈ విధంగా ముగింపు పలికారని తెలుస్తోంది.ఇక సీరియల్ లో ఎంతో పద్ధతిగా కనిపించే ఈమె బయట మాత్రం చాలా హాట్ గా ఉంటారనే చెప్పాలి.ఈమె సోషల్ మీడియా( Social Media ) ఖాతా కనక చూస్తే అసలు ప్రతిరోజు మనం సీరియల్లో చూసే జగతి మేడమేనా ఇక్కడ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయక మానదు.
పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.
ఇక ఈమె ఇదివరకే పద్మనాభం అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆయన నుంచి విడాకులు తీసుకొని విడిపోయారు.ఇలా విడాకులు తీసుకొని విడిపోయినటువంటి జ్యోతి తనకన్నా వయసులో చిన్నవాడు అయినటువంటి సుఖ పూర్వజ్ ( Sukh Purvaj ) అనే ఒక డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నారు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ఇక ఆ డైరెక్టర్ తో ఈమె చాలా చనువుగా ఉన్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చూడటానికి చాలా ఎంతో అందంగా యంగ్ గా కనిపిస్తూ ఉంటారు.అయితే ఈమె రోజురోజుకు ఇలా పడుచు పిల్లల తయారవ్వడానికి కారణం ఆమె జిమ్ లో చేసే వర్కౌట్స్ కారణమని చెప్పాలి.
సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్ గా ఉండే జ్యోతి తనకు సంబంధించిన అన్ని వీడియోలను, ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈమె జిమ్ లో భారీగా కష్టపడుతున్నటువంటి వీడియోలను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.చెమటలు చిందేలా ఈమె వర్కౌట్స్( Jyothi Rai Gym Workouts ) చేస్తూ ఫిట్నెస్ పొందుతున్నారు.
ఇలా భారీగా వర్కౌట్ చేయడం వల్లే ఈమె వయసు పెరుగుతున్న చాలా యంగ్ గా కనిపిస్తున్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.మీ బ్యూటీ సీక్రెట్ కూడా ఇదే నా మేడం అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇలా ఈమె భారీగా వర్కౌట్ చేస్తూ ఎంతో ఫిట్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy