తెలుగులో తక్కువ సినిమాలలోనే నటించినా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోలలో తొట్టెంపూడి వేణు ఒకరు.
రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో తొట్టెంపూడి వేణు సీఐ రోల్ లో నటించగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వేణు మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.వేణు మాట్లాడుతూ రీల్ లైఫ్, రియల్ లైఫ్ రెండూ వేర్వేరు పార్శ్వాలు అని చెప్పుకొచ్చారు.
రీల్ లైఫ్ ను, రియల్ లైఫ్ ను ఒకదానితో ఒకటి కలపలేమని ఆయన చెప్పుకొచ్చారు.నేను సినిమాలు, సినిమాల ప్రమోషన్స్ కోసం బయటకు వెళుతుంటే ఆ సమయంలో కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్న వ్యక్తి తన భార్య అని వేణు కామెంట్లు చేశారు.
ఆ క్రెడిట్ అంతా నా భార్యకే దక్కుతుందని వేణు పేర్కొన్నారు.తనకు పాప, బాబు ఉన్నారని పాప 12వ తరగతి బాబు 10వ తరగతి చదువుతున్నారని వేణు చెప్పుకొచ్చారు.
సినిమా రంగంలో మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అవుతారా అనే ప్రశ్నకు నో క్లూ అని ఆయన సమాధానం ఇచ్చారు.ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయనే ప్రశ్నకు వేణు స్పందిస్తూ నేను బావిలో కప్పలాంటోడినని నాకు బయటి ప్రపంచం అసలు తెలియదని వేణు అన్నారు.
ప్రపోజల్స్ గురించి తెలియదు కానీ నేను ఎక్కడికి వెళ్లినా వయస్సులో పెద్ద అయిన ఆడవాళ్లు బాబు నీకు పెళ్లైందా అని అడుగుతారని వేణు తెలిపారు.
అలా ఆడవాళ్లు అడిగిన ప్రశ్నలను కాంప్లిమెంట్ గా తీసుకుంటానని వేణు చెప్పుకొచ్చారు.మంచి మూవీ ఆఫర్లు వస్తే చేస్తానని వేణు కామెంట్లు చేశారు.ప్రస్తుతానికి మంచి ఆర్టిస్ట్ గా ఉండాలని నేను అనుకుంటున్నానని వేణు చెప్పుకొచ్చారు.
జీవితం ఏది ఇస్తే అది తీసుకో.ఏముంటే దానిని ఎంజాయ్ చెయ్ అని వేణు తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy