హరికృష్ణ అలా చేయడంతో భయపడి బస్ లో వెళ్లాను.. నటుడి కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటుడు సత్యప్రకాష్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

విలన్ గా సత్య ప్రకాష్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సత్య ప్రకాష్ మాట్లాడుతూ వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కిన అన్ని హిట్ సినిమాలలో తాను నటించానని చెప్పుకొచ్చారు.లాహిరిలాహిరిలాహిరిలో దేవదాస్ మూవీ కంటే పెద్ద హిట్ అని సత్యప్రకాష్ వెల్లడించారు.

సీతయ్య, సీతారామరాజు సినిమాలలో కూడా తాను నటించానని ఆయన వెల్లడించారు.వైవీఎస్ చౌదరి బెస్ట్ డైరెక్టర్ కావడంతో పాటు బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అని ఆయన తెలిపారు.

సీతారామరాజు సినిమాలో హోలీ రంగోళి అని చెప్పే డైలాగ్ కెరీర్ కు ప్లస్ అయిందని ఆయన వెల్లడించారు.పోకిరి సినిమాలో తనను కట్టేసే సీన్ ఒక రేంజ్ లో క్లిక్ అయిందని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Actor Satyaprakash Comments Goes Viral In Social Media Details Here , Comments V

బాలయ్య, హరికృష్ణ ఇద్దరూ గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ అని సత్య ప్రకాష్ వెల్లడించారు.బాలయ్య బాబుతో ఎంత క్లోజ్ తో ఉంటానో హరికృష్ణతో తాను ఇంకా ఎక్కువ క్లోజ్ గా ఉండేవాడినని సత్యప్రకాష్ పేర్కొన్నారు.

హరికృష్ణతో శ్రీశైలం వరకు జర్నీ చేశానని ఆ తర్వాత ఆయనతో ఎప్పుడూ జర్నీ చేయకూడదని డిసైడ్ అయ్యానని సత్యప్రకాష్ చెప్పుకొచ్చారు.హరికృష్ణ దేనినీ కేర్ చేసేవారు కాదని హరికృష్ణ డ్రైవింగ్ కు భయపడి తాను రిటర్న్ జర్నీలో బస్ లో వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు.

Actor Satyaprakash Comments Goes Viral In Social Media Details Here , Comments V

నందమూరి ఫ్యామిలీనే డేరింగ్ అని సత్యప్రకాష్ పేర్కొన్నారు.నాపై బాలయ్య ఇన్ ఫ్లూయెన్స్ ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు.తనపై మెగాస్టార్ ఇన్ ఫ్లూయెన్స్ ఉందని సత్యప్రకాష్ వెల్లడించారు.

ఇండస్ట్రీలో తొక్కేయడం నిజం కాదని ఆయన తెలిపారు.ప్రైమ్ మినిష్టర్ మోదీ నచ్చేవాళ్లు ఎలా ఉంటారో నచ్చనివాళ్లు కూడా అలానే ఉంటారని ఆయన తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు