ప్రముఖ నటుడు ఇంట్లో వరుస విషాదాలు.. ఏడాదిలోపే ఇద్దరూ ?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

కొంతమంది అనారోగ్యాలు కారణంగా మరణిస్తే కొంతమంది రోడ్డు ప్రమాదాలు మరికొంతమంది ఆత్మహత్య ల కారణంగా మరణిస్తున్నారు.

ఒక సెలబ్రిటీ చనిపోయారు అని ఆ బాధ నుంచి కోలుకునే లోపే మరొకరు చనిపోతున్నారు.అలా సినిమా ఇండస్ట్రీలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి.

అయితే ప్రముఖ బహుభాషా నటుడు అయిన రవి కిషన్ ఇంట్లో కూడా వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.రవి కిషన్ ఇంట్లో ఓకే ఏడాదిలోనే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు.2022 మార్చి నెలలో రవి కిషన్ పెద్ద అన్న ఆయన రమేష్ కిషన్ శుక్లా క్యాన్సర్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.అయితే రమేష్ కిషన్ మరణించి ఏడాది కూడా పూర్తికాక ముందే మరో ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది.

రవి కిషన్ పెద్ద అన్నయ్య అయిన రామ్ కిషన్ తాజాగా మరణించారు.తాజాగా ఆదివారం రోజున ఉదయం రామ్ కిషన్ సడన్ కార్డియాక్ అరెస్టుకు గురి కావడంతో ముంబైలో నానావతి ఆసుపత్రికి తీసుకెళ్లగా

Advertisement

చికిత్స పొందుతూ తాజాగా సోమవారం రోజు మృతి చెందారు.అయితే ఇదే విషయాన్ని రవి కిషన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.అంత్యక్రియలకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఈ విధంగా రాసుకొచ్చాడు.

చాలా బాధాకరం.మా పెద్ద అన్నయ్య రామ్ కిషన్ ఆదివారం కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యాడు.

ఆయన్ని ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేర్పించాము.చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.

మహాదేవుడు ఆయన ఆత్మకు తన కాళ్ల దగ్గర చోటు ఇవ్వాలని కోరుకుంటున్నాను.ఓం శాంతి, శాంతి అని రాసుకొచ్చాడు రవి కిషన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??

మా పెద్ద అన్నయ్య రామకృష్ణ నిజంగా ఇంటికి రాముడు లాంటి వాడు.ఆయన నిర్మలమైన నగుముఖాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము.

Advertisement

ఆయన ఆకస్మిక మరణం మమ్మల్ని షాక్ కు గురిచేసింది అని రాసుకొచ్చాడు రవి కిషన్.

తాజా వార్తలు