మత ప్రచారంలో సినిమాలపై కామెంట్స్ చేసిన ఒకప్పటి హీరో రాజా.. నెట్టింట్లో వైరల్!

టాలీవుడ్ హీరో రాజా గురించి మనందరికి తెలిసిందే.

ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు హీరో రాజా.

అలా దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమా రాజా కు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.అంతకు ముందు న‌టించిన ఓ చిన‌దాన‌, అప్పుడ‌ప్పుడు సినిమాలు కూడా రాజా కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.

అయితే ఆ తరువాత రాజా ప‌లు సినిమాలలో న‌టించినప్ప‌టికీ అనుకున్న స్థాయిలో విజ‌యాల‌ను అందుకోలేక‌పోయారు.త‌ర్వాత హీరోగా కాకుండా సినిమాలలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ న‌టించి మెప్పించారు.

ఇకపోతే ఈ మ‌ధ్య కాలంలో సినిమాల‌లో రాజా పూర్తిగా కనిపించడం లేదు.అసలు రాజా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు అన్న విషయాలు కూడా చాలా మందికి తెలియదు.

Advertisement

క్రిస్టియ‌న్ అయిన ఆయ‌న మ‌త ప్ర‌చార‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ఇదంతా కూడా రాజా వ్య‌క్తిగ‌త‌మే.

ఆయ‌న ఏ మ‌తాన్ని అయినా ప్ర‌చారం చేసుకోవ‌చ్చు అందులో త‌ప్పు లేదు.ఇది ఇలా ఉంటే రాజా కు సంబంధించిన ఒక వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

ఆ వీడియోలో రాజా మాట్లాడుతూ శుక్రవారం వచ్చింది మార్నింగ్ షో ఎంత ప‌ట్టుద‌లో,ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూసేయ‌డానికి, కానీ మనకు లాస్ట్ డే దేవుడు చూపిస్తాడు సినిమా అబ్బ‌బ్బా చాలా అద్భుతంగా ఉండ‌బోతుంది అని తెలిపాడు.

ప్రార్థించ‌డ‌య్యా ఆ ప‌నికి మాలిన సినిమాలు చూడటం వ‌ల్ల మీకే లాభ‌మూ లేద‌య్యా.గంట సేపు లైన్‌లో నిల్చొని మూడు గంట‌ల సేపు సినిమాలు చూసే బ‌దులుగా.ఆ నాలుగు గంట‌లు మీ త‌ల్లిదండ్రులు, ర‌క్త సంబంధీకులు, మీ బంధువుల కోసం ప్ర‌పంచంలో స‌మాధానం కోసం ప్రార్థ‌న చేయండి.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

ఇంత చెడుత‌న‌ము మ‌న చుట్టు ప‌క్క‌ల ఉంటుండ‌గా మ‌నం ఏమాత్రం చ‌ల‌నం లేకుండా బ్ర‌త‌కుతున్నామంటే దుష్టుడితో మ‌నం ఫ్రెండ్ షిప్ చేసుకున్న‌ట్లే అని చెప్పుకొచ్చాడు రాజా. ఈ వీడియోపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు.30 సినిమాల దాకా నటించిన ఇప్పుడేం మాట్లాడుతున్నావ్.అని ఒకరంటే ఏం నటిస్తున్నావ్ బ్రో.

Advertisement

యాక్టింగ్ ఏదో నీ సినిమాల్లో చేసుంటే టాప్‌లో ఉండేవాడివి అని మరొకరు, ఇలా నెటిజన్స్ తమదైన శైలిలో స్పందింస్తు రాజా పై ట్రోల్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు