పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం విరాటపర్వం. డి.
సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.
వి.సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది.ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరో నవీన్ చంద్ర మీడియాతో మాట్లాడారు.
ఆయన పంచుకున్న విరాటపర్వం విశేషాలివి.
ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు కథలో చిన్న మార్పు తేవడమో, ట్విస్ట్ ఇవ్వడమో లాంటివే చేశాను.కానీ విరాటపర్వం లో మాత్రం పూర్తికథనే తలకిందులు చేసే పాత్రలో కనిపిస్తా.
ఇందులో నా పాత్ర పేరు రఘన్న. సినియర్ ఉద్యమకారుడిగా కనిపిస్తా.ఉద్యమం తప్ప దేన్నీ లెక్కచేయను.
ఎలాంటి ఎమోషన్ కి లొంగను.ఈ కారణంతోనే గ్రూప్ లో సీనియర్ గా గుర్తింపు దక్కాల్సిన నా పాత్ర జూనియర్ ఉద్యమ కారుడిగా వుంటుంది.
ఆ ఈర్ష్య కూడా నా పాత్రలో కనిపిస్తుంది.అలాగే ప్రియమణి గారు భారతక్క పాత్రలో కనిపిస్తారు.
మా రెండు పాత్రలు రవన్న పాత్ర పోషిస్తున్న రానాగారికి దగ్గరగా వుంటాయి.మాకు అన్నిటికంటే ఉద్యమం, విధానాలే ముఖ్యం.
సాయి పల్లవి గారు వెన్నెల పాత్రలో కనిపిస్తారు.ఉద్యమంతో పాటు ఒక గొప్ప ప్రేమకథ విరాటపర్వంలో వుంది.
ఇది వండర్ ఫుల్ మూవీ.దర్శకుడు వేణు ఉడుగుల గారు అద్భుతంగా రాశారు, తీశారు.
విరాటపర్వం కోసం చాలా కష్టపడ్డాం.కానీ ఇష్టంగా చేశాం.
కొత్తకథని బలమైన పాత్రలతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు వేణు గారు.ఇందులో నేనూ భాగం కావడం ఆనందంగా వుంది.
ఇందులో చాలా మంచి పాత్ర నాకు దక్కింది.దాదాపు 35నిమిషాల పాటు నా పాత్ర ఒక బ్లాస్ట్ పేలుతుంది.
ప్రతి ఒక్కరికి ప్రశ్నలు సంధిస్తుంది.ఇంత పవర్ ఫుల్ పాత్ర దక్కినందుకు చాలా ఆనందంగా వుంది.
బళ్ళారి బోర్డర్ కాబట్టి ఆంధ్ర రాయలసీమ ప్రభావం నాపై వుంది.కానీ మొదటిసారి నాతో తెలంగాణ యాసని అద్భుతంగా చెప్పించారు దర్శకుడు వేణు.డైలాగ్స్ లో కూడా కవిత్వం వినిపిస్తుంది.
చాలా డీప్ మీనింగ్ వున్న సంభాషణలు ఇందులో వుంటాయి.ఈ సినిమా చేయడం నిజంగా ఒక ఛాలెంజ్.
చాలా మెమరబుల్ ఇన్సిడెంట్స్ వున్నాయి.అడవిలో ఒక సీన్ చేసినప్పుడు గట్టిగా అరుస్తూ మాట్లాడాలి.
గట్టిగా అరిస్తే ఆ సౌండ్ కి ఏనుగులు వస్తాయి.ఒకటి రెండుసార్లు వచ్చాయి కూడా.
ఐతే మా పైన ఎలాంటి దాడి చేయలేదు.అతిరపల్లి, వికారబాద్ అడవుల్లో షూటింగ్ చేశాం.
హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫెన్ రిచర్డ్ నేతృత్వంలో వండర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాం.చాలా అద్భుతమైన టీమ్ వర్క్ చేశాం.
ఇలాంటి కథలు, సినిమాలు చాలా అరుదుగా వస్తాయి.ఇది నిజంగా జరిగిన కథ , దర్శకుడు వేణు గారికి తెలిసిన కథ, ఆయన ఎక్స్ పీరియన్స్ చేసిన కథ .అలాంటి కథని తెరపైకి తీసుకురావడంలో అందులో నేను కీలక పాత్ర పోషించడం, నటనకి ఆస్కారం వుండే పాత్ర దక్కడం అదృష్టంగా భావిస్తున్నా.
రానా చూడటానికి ఆజానుబాహుడులా వుంటారు.తెలివిగా మాట్లాడతారు.
ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది.ఆయన చిన్న పిల్లల మనస్తత్వం, అందరితో చాలా సరదాగా వుంటారు.
ఆయన ప్రతి క్షణం సినిమా గురించే ఆలోచిస్తారు.ప్రతి ఇండస్ట్రీలో జరుగుతున్న సినిమాల అప్డేట్స్ ఆయన దగ్గర వుంటాయి.
రానా గారు బిగ్ ఇన్ ఫర్మేషన్ బాక్స్.
గన్స్ పట్టుకోవడం దగ్గర నుండి బాంబ్ బ్లాస్ట్, అడవిలో ప్రయాణం, కొండలు ఎక్కడం .ఇలా చాలా ట్రైనింగ్ వుంది ఈ సినిమాలో.అయితే మాకు ఎక్కడా ఇబ్బంది లేకుండా నిర్మాతలు అన్నీ దగ్గరుండి సమకూర్చారు.
లాక్ డౌన్ టైంలో సానిటైజేషన్ తో పాటు టీంతో ఎప్పుడూ ఒక అంబులెన్స్ వుండేది.అడవిలో నటీనటులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా లొకేషన్ లో ముందే ప్రొడక్షన్ టీం రెక్కీ నిర్వహించి అన్ని వసతులు కల్పించేవారు.
సాయి పల్లవిగారితో కలసి పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్.వెన్నెల పాత్ర నుండి ఆమె బయటికి రాలేదు.చాలా హార్డ్ వర్క్ చేశారు.
వెన్నెల పాత్ర చుట్టే విరాటపర్వం కథ తిరుగుతుంది.వెన్నెల పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ఇది అదృష్టంగా భావిస్తున్నా.నన్ను చాలా మంది హీరోగా ఫిక్స్ అయిపోయారు.
ప్రతి నటుడికి హీరోగా చేయాలనీ వుంటుంది.హీరోగా చేయాల్సిన సినిమాలు వస్తే చేస్తున్నాను.
కానీ చాలా మంది దర్శకులు నన్ను ఎంచుకుంటున్నారంటే కారణం నా వర్క్ అని భావిస్తున్నా.సినిమా ఆడినా ఆడకపోయినా నేను చక్కగా చేశాననే గుర్తింపు వస్తుంది.
అదే నన్ను కాపాడుతుంది.సినిమా సినిమాకి ఎదుగుతున్నా.
మంచి దర్శకులతో పని చేస్తున్నా.నాపై నమ్మకం వుంచి మంచి పాత్రలు ఇస్తున్న దర్శకులకు కృతజ్ఞతలు.
దర్శకులు ఎంతో ఇష్టంగా పాత్రలు రాసుకుంటారు.దర్శకుల విజన్ కి తగ్గట్టు నటించడం నా బాధ్యత.
లాక్ డౌన్ సమయంలో సడన్ గా ఒక షాక్.ప్రతిరోజు పనిచేసే నటులం.
అవకాశం కోసం చూసేవాళ్ళం.లాక్ డౌన్ లో సినిమాలు లేవు.
షూటింగులు తగ్గిపోయాయి.అలాంటి సమయంలో ఓటీటీలు ముందుకు వచ్చాయి.
కొన్ని మంచి అవకాశాలు ఇచ్చాయి.పని దొరికినట్లయింది.
కొన్ని సినిమాలు చేశాను.మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
ఆ సినిమాలు థియేటర్ లో వస్తే బావుండేది.అయితే నిర్మాతలదే అంతిమ నిర్ణయం.
ఇంకొన్ని ఓటీటీ సినిమాలు చేశాను.అవి కూడా వరుసగా విడుదలకు సిద్ధంగా వున్నాయి.
అందులో కొన్ని థియేటర్ లో వచ్చే అవకాశం కూడా వుంది.
ఇంతకుముందు దళం అనే సినిమా నక్సల్ నేపధ్యంలో చేశాను.ఇలాంటి సినిమాలు చేసినప్పుడు ఫిట్నెస్ ఎక్కువ కావాలి.
యాక్షన్ సీన్స్ కి చాలా కష్టపడాలి.విరాటపర్వంలో నేను,సాయిపల్లవి, రానా, ప్రియమణి .నలుగురం కలసి సింగిల్ షాట్ లో గన్స్ పట్టుకొని అర కిలోమీటర్ పరిగెత్తాలి.ఎక్కడ కెమెరా మిస్ అయినా, టెక్నికల్ గా ఏదైనా సమస్య తలెత్తినా మళ్ళీ పరిగెత్తాలి.
ఒక్క టేక్ లో ఓకే అవ్వద్దు.మళ్ళీ మళ్ళీ చేయడానికి చాలా ఫిట్నెస్ వుండాలి.
అలాగే తెలంగాణ యాస నేర్చుకోవడం కూడా గొప్ప అనుభవం.దర్శకుడు వేణు గారు వారి టీం ఎంతో అద్భుతంగా తెలంగాణ యాసని నేర్పించారు.
విరాటపర్వం చిత్రానికి దర్శకుడు వేణు గారు రాసిన ఒకొక్క లైను చాలా డెప్త్ వుంటాయి.ముఖ్యంగా వెన్నెల పాత్ర అందరికీ గుర్తిండిపోతుంది.
ఇది వెన్నెల కథే.ఆ పాత్ర చుట్టే మిగతా పాత్రలన్నీ వుంటాయి.ఇందులో ప్రతి సంఘటన ఎంతో ఆసక్తికరంగా వుంటుంది.
లేదండీ.చాలా భిన్నమైన పాత్రలు చేస్తున్నా.రామ్ చరణ్ గారి సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నా.
కథలో ప్రాముఖ్యత వున్న పాత్రలని ఎంపిక చేసుకొని చేస్తున్నా.ఇమేజ్ కోసం ఏమీ చేయడం లేదు .మంచి కథ, సినిమాలో వుంటే చాలనే కోరిక.
నాలుగు సినిమాలు రిలీజ్ కి వున్నాయి.అమెజాన్ ఒరిజినల్ కి ఒక సినిమా, అమ్ము , పరంపర సీజన్2, యువీ కాన్సెప్ట్స్ లో హీరోగా ఒక సినిమా చేశాను.
తమిళ్, తెలుగు బైలింగ్వల్ ఒకటి అలాగే రామ్ చరణ్ గారితో చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుంది.అలాగే బాలకృష్ణ - గోపిచంద్ మలినేని గారి సినిమా చేస్తున్నా.
బాలకృష్ణ గారితో పని చేయడం మాత్రం అవుట్ అఫ్ ది వరల్డ్ ఎక్స్ పీరియన్స్.ఆయన చూస్తూనే ప్రేమ వచ్చేస్తుంది.
ముద్దు పెట్టాలనిపిస్తుంది.బాలకృష్ణ గారు అద్భుతమైననటులు, గొప్ప వ్యక్తి.
బాలకృష్ణ గారి సినిమాలో కూడా నాది కీలక పాత్రే.
లేదండీ.హీరోగా చేయడం అనేది సెఫరేటు.నాలుగు నెలలు ఒకే కథపై వుంటాం.
దానికి వచ్చే పేరు, రేమ్యునిరేషన్ వేరుగా వుంటాయి.కానీ పాత్రలు చేయడంలో కూడా నటుడిగా నాకు తృప్తిని ఇస్తుంది.
పాత్రకి చాలా తక్కువ నిడివి వుంటుంది.అందులోనే నిరూపించుకోవాలి.
ఈ ఛాలెంజ్ ని తీసుకోవడం నటుడిగా నాకో తృప్తి వుంటుంది.
లేదండి.నిర్మాతలు, దర్శకుడు చాలా సపోర్టివ్ గా వుంటున్నారు.ఒకవేళ క్లాష్ వచ్చినా సర్దుబాటు చేసుకుంటున్నారు.
దర్శకుడు శ్రీకాంత్ నగూతి, కార్తిక్ సుబ్బరాజులతో చేసిన సినిమాలు చాలా విలక్షణంగా ఉండబోతున్నాయి.ఆ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy