Chalaki Chanti: రీ ఎంట్రీ ఇచ్చిన చలాకి చంటి.. ఆరోగ్యం కుదుటపడినట్టేనా?

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి( Chalaki Chanti ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జబర్దస్త్ లో( Jabardasth ) తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి కమెడియన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు చంటి.

గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో( Bigg Boss 6 ) కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే.కానీ బిగ్ బాస్ షో ద్వారా చంటికి పెద్దగా గుర్తింపు దక్కలేదు.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంటి శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ షోలో తనదైన శైలిలో కామెడీ చేసిన నవ్వించాడు.ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు చంటి బుల్లితెరపై అంతగా కనిపించడం లేదు.

దాంతో అభిమానులు ఏమయిందా అని ఆరా తీయగా ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.చంటీకి హార్ట్ ఎటాక్( Heart Attack ) రావడంతో హాస్పటల్లో చేర్పించారని ప్రస్తుతం చంటికి ఐసీఈలో చికిత్స జరుగుతోంది అంటూ వార్తలు జోరుగా వినిపించాయి.అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

దీంతో ఇప్పట్లో చంటి కోలుకునేలా లేడు బుల్లితెర పైకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది అని అందరూ అనుకున్నారు.

కానీ తాజాగా ఒక్కసారిగా బుల్లితెరపై కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు చంటి.కాగా ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో చంటికి గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే.ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొన‍్నప్పటికీ, దాని నుంచి బయటపడ్డాడు.

ఇది జరిగిన మూడు నెలలు కూడా కాలేదు.అప్పుడే ప్రముఖ కామెడీ షోలో ప్రత్యక్షమయ్యాడు.

అయితే చూడటానికి కాస్త డల్‌గానే కనిపించాడు.దీంతో ఫ్యాన్స్ చంటి హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నారు.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 

చంటి ఆరోగ్యం కూడా కుదుటపడినట్లేనా అని యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు