నాకు ఆ పిచ్చి లేదు కనుక పెద్ద ఆఫర్ కూడా రిజెక్ట్ చేశాను: అడివి శేష్

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ఒకరు.

ఈయన క్షణం, మేజర్, గూఢచారి, హిట్ 2 వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.ఇకపోతే నేడు హీరో అడివి శేష్ పుట్టినరోజు (Adivi Sesh Birthday) కావడంతో ఈయన స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలైనటువంటి తన ప్రయాణం ఇప్పుడు హీరోగాను అలాగే పాన్ ఇండియా రేంజ్ వరకు వెళ్ళింది.తిరిగి మీకు ఏదైనా సినిమాలలో కీలకమైనటువంటి రోల్ లభిస్తే నటిస్తారా అన్న ప్రశ్న ఈయనకు ఎదురయింది.ఈ ప్రశ్నకు అడివి శేష్ సమాధానం చెబుతూ.

Advertisement

సినిమాలలో ఏ పాత్ర అయినా సరే ఆ కథను సినిమాను క్యారీ చేయగలిగితే తప్పకుండా నేను అలాంటి పాత్రలలో నటిస్తాను అని ఈయన తెలియజేశారు.ఇకపోతే ఇటీవల కాలంలో ఒక భారీ బడ్జెట్ సినిమాని( High Budget Movie ) కూడా మీరు వదులుకున్నారని తెలుస్తుంది.

అలా వదులుకోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న కూడా తనకు ఎదురయింది.

ఇండస్ట్రీలో కొనసాగడం అంటే మంచి సినిమాలు చేయడం డబ్బును సంపాదించుకోవడం జరుగుతుంది అయితే చాలా తక్కువ మందికి మాత్రమే మంచి సినిమాలపై డబ్బు పోగు చేసుకోవడం వీలు కలుగుతుంది.ఇక నాకైతే డబ్బు (Money) పిచ్చి లేదని తెలిపారు నా స్నేహితులు ఈ విషయంలో నన్ను తిడుతూ ఉంటారని తెలిపారు.ఇలా నాకు డబ్బు పిచ్చి లేదు కనుక మంచి సినిమాల కోసం ఎదురు చూస్తూ మంచి సినిమాలను మాత్రమే తాను చేస్తానని తెలిపారు.

నా దృష్టి ఎప్పుడు ఈ సినిమాకు ఎంత వచ్చింది అనేదాని మీద కాకుండా నా సినిమాని చూసినటువంటి ఆడియన్స్ ఎలా ఫీలవుతున్నారు అనే దాని పైన నేను దృష్టి పెడతాను అంటూ ఈ సందర్భంగా శేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..
Advertisement

తాజా వార్తలు