తెలంగాణ ఎన్నికల్లో పోటీపై త్వరలోనే నిర్ణయం..అచ్చెన్నాయుడు

తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఏపీ టీడీపీ నేత అచ్చెన్నాయుడు స్పందించారు.తెలంగాణ ఎన్నికల్లో పోటీ విషయంపై ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ మేరకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ టీడీపీ నాయకులతో చర్చిస్తున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.అతి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

అయితే ఇప్పటికే తెలంగాణలో కూడా పోటీ చేయాలని టీడీపీ భావించినప్పటికీ చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పార్టీ క్యాడర్ నిస్తేజంలో ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో పోటీపై సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది.

అలాగే తాజాగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు వెళ్లిన బాలయ్య పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు.

Advertisement
చలికాలంలో వచ్చే గొంతు నొప్పికి నివారణ ఈ చిట్కా చాలు..!

తాజా వార్తలు