వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడికి బెయిల్

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో యువతి వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడికి బెయిల్ వచ్చింది.

ఈ మేరకు నిందితుడు నవీన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కాగా 2022 డిసెంబర్ 9వ తేదీన డాక్టర్ వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో నవీన్ రెడ్డిని గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.

అయితే బెయిల్ కోసం నవీన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను ఇటీవల రంగారెడ్డి జిల్లా కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు