గరుడపురాణం ప్రకారం ఈ పద్ధతుల ద్వారా మోక్షం లభిస్తుంది.. అవి ఏమిటంటే?

మనం ఎంతో పవిత్రంగా భావించే పద్దెనిమిది పురాణాలలో గరుడ పురాణం ఒకటి.గరుడ పురాణాన్ని మహాపురాణం అని కూడా పిలుస్తారు.

ఈ గరుడ పురాణానికి ఆది దేవుడు శ్రీమహావిష్ణువు.ఈ పురాణం మనం బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి తప్పులు చేస్తే మరణం తర్వాత మనకు ఎలాంటి శిక్షలు విధిస్తారు.

నీతి, నైతికత, జ్ఞానం, త్యాగం, తపస్సు మొదలైన వాటి ప్రాముఖ్యత గురించి వివరిస్తుంది.గరుడ పురాణం మనిషి మరణం ముందు మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలను ఎంతో అద్భుతంగా తెలియజేస్తుంది.

ఈ క్రమంలోనే మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఏవిధంగా మోక్షం పొందాలనే విషయాలను ఈ గరుడ పురాణంలో ఎంతో అద్భుతంగా తెలియజేశారు.మరి మోక్షం కలిగించే ఆ పద్ధతులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement
According To The Garuda Purana Nirvana Is Attained With These Methods, Garuda Pu

మన పురాణాల ప్రకారం అన్ని లోకాలకు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి రక్షకుడిగా ఉంటాడు.అన్ని లోకాలలో ఏర్పడే బాధలను తొలగించే శక్తి విష్ణుమూర్తికి ఉందని భావిస్తాము.

అందుకే ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ శ్రీహరి నామ స్మరణ చేస్తూ రోజును ప్రారంభించడం ఎంతో ముఖ్యమని గరుడ పురాణం మనకు తెలియజేస్తుంది.అదేవిధంగా గరుడ పురాణంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత కల్పించారు.

తులసి మొక్కను సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించాలని,తులసికి ప్రతి రోజు పూజ చేయడం వల్ల మోక్షం కలుగుతుందని గరుడపురాణం తెలుపుతోంది.మనిషి మరణించే ముందు తులసి నీటిని నోట్లో పోయడం వల్ల అతని మరణాంతరం తనకు మోక్షం కలుగుతుందని ఈ పురాణం తెలియజేస్తుంది.

According To The Garuda Purana Nirvana Is Attained With These Methods, Garuda Pu

ఒక వ్యక్తి తాను చేసిన పాపాల నుంచి మోక్షం పొందాలంటే ఏకాదశి ఉపవాస దీక్షలు చేయాలని గరుడ పురాణం చెబుతోంది.ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసి విష్ణు మూర్తికి పూజ చేయటం వల్ల మనం చేసిన పాపాలు హరించుకుపోయి మనకు విముక్తి కలుగుతుంది.ఈ ఏకాదశి రోజు ఉపవాసంతో విష్ణువుకు పూజ చేసి విష్ణు సహస్రనామాలను పఠించడం ద్వారా మోక్షం కలుగుతుంది.

అండర్ ఆర్మ్స్ తెల్లగా, మృదువుగా మారాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!

ఇక చివరిగా గరుడ పురాణంలో గంగానదిని మోక్షదాయనిగా అభివర్ణించారు.కలియుగంలో ఈ నీటికీ ఎంతో ప్రాధాన్యత ఉండటం చేత ముఖ్యమైన శుభకార్యాలను ఈ నీటి ద్వారా ప్రారంభించడం వల్ల మోక్షం కలుగుతుందని గరుడ పురాణం చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు