హెచ్-1బీ, ఎల్ -1 వీసా పొడిగింపులో కొత్త నిబంధనలు.. యూఎస్ కంపెనీలకు భారమేనా..?

విదేశాలకు చెందిన నిపుణులైన వారిని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసా( H-1B visa ) రుసుము పెంపుపై విదేశీ ఉద్యోగులు, పెట్టుబడిదారులు గమనిస్తున్నారు.

అయితే బైడెన్ యంత్రాంగం వర్క్ వీసా పొడిగింపులకు అదనపు రుసుములపై దృష్టి పెడుతున్నందున పైన పేర్కొన్న పార్టీలకు ఎలాంటి సడలింపులు ఇచ్చేలా కనిపించడం లేదు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)( Department of Homeland Security ), యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ప్రతిపాదించిన కొత్త నియమం ప్రకారం హెచ్-1, ఎల్ -1 వీసా పొడిగింపులపై 9/11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ రుసుమును విధించనున్నారు.ఇప్పటి వరకు ఈ నిబంధనలు ప్రారంభ స్థాయిలోని వీసా పిటిషన్‌లకు మాత్రమే వర్తించేవి.

‘‘ FederalRegister.gov ’’ వెబ్‌సైట్ .నిర్ధిష్ట హెచ్ 1, ఎల్ - 1 పిటిషన్‌ల కోసం కాంగ్రెస్ 9/11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ రుసుమును ఏర్పాటు చేసినట్లు తెలిపింది.దీనికి విరుద్ధంగా కొత్త సవరణ ప్రతిపాదన ఆ పదబంధాన్ని ఈ రెండు పిటిషనర్ల సమూహాలకు సంబంధించిన క్లాజులలో ‘‘అన్ని పిటిషనర్లు’’తో భర్తీ చేయడానికి ప్రయత్నించనుంది.

ఎంట్రీ - ఎగ్జిట్ సిస్టమ్‌ను మెరుగుపరచడానికి డీహెచ్ఎస్ ( Department of Homeland Security )తరచుగా ప్రయత్నిస్తుంటుంది.ఈ అదనపు నిధులు నిర్వహణను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా ప్రతిపాదిత నిబంధనలు .యజమానులు జాతీయ భద్రతకు దోహదపడేలా చేస్తాయని అంటున్నారు.అయితే ఈ ప్రభుత్వ ప్రతిపాదనల కారణంగా అమెరికన్ యజమానులపై ఆర్ధిక భారం పెరిగే అవకాశాలు ఉండటంతో కంపెనీలు తమ నియామక వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

హెచ్ 1 వీసా పొడిగింపుల కోసం 4 వేల డాలర్లు.ఎల్ -1 వీసా పొడిగింపు కోసం 4,500 డాలర్లను యూఎస్ యజమానులు చెల్లించాలని జూన్ 6 నాటి ఆర్డర్ సూచిస్తుంది.ప్రతిపాదిత నిబంధనలకు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు.

ప్రస్తుతానికి ప్రారంభ స్థాయి పిటిషన్‌లు, యజమానుల మార్పిడికి మాత్రమే రుసుమును చెల్లిస్తున్నారు.ప్రస్తుతానికి డీహెచ్ఎస్ ప్రతిపాదిత మార్పులపై ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది.

సాధారణ ప్రజల కామెంట్స్ విండో జూలై 8, 2024న క్లోజ్ చేస్తారు.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు