ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్‎కు ఏసీబీ కోర్టు షాక్

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ అధికారులకు ఏసీబీ కోర్టు షాకిచ్చింది.సిట్ దాఖలు చేసిన మెమోపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయస్థానం దానిని తిరస్కరించింది.

బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామితో పాటు శ్రీనివాస్ పేర్లను సిట్ నిందితుల జాబితాలో చేర్చింది.వీరందరీ పేర్లను నిందితులుగా చేర్చుతూ సిట్ దాఖలు చేసిన మెమోను ధర్మాసనం కొట్టివేసింది.

కాగా తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.విచారణలో భాగంగా పలువురికి నోటీసులు అందజేసింది.

Bet Plays Mobile App And Mobile Experience : A Practical Guide For Canadian Players
Advertisement