ఏపీలో ఏసీ ఆర్టీసీ బ‌స్సు ఛార్జీలు త‌గ్గింపు

ఏపీలో ఏసీ ఆర్టీసీ బ‌స్సు ఛార్జీలను తాత్కాలికంగా తగ్గిస్తూ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

దీనిలో భాగంగా ప‌లు రూట్లలో న‌డిచే ఏసీ బస్సుల్లో 10 నుంచి 20 శాతం మేర ఛార్జీలు త‌గ్గాయి.

ఇక ఈ త‌గ్గింపు ఈనెల 30 వ‌ర‌కు అమ‌లులో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ ఏసీ బ‌స్సుల్లో 10 శాతం ఛార్జీల‌ను త‌గ్గించారు.

విజ‌య‌వాడ‌-విశాఖ మ‌ధ్య న‌డిచే బ‌స్సుల్లో 20 శాతం మేర ఛార్జీల‌ను త‌గ్గించారు.అలాగే, విజ‌య‌వాడ నుంచి చెన్నై, బెంగ‌ళూరు వెళ్లే బ‌స్సుల్లోనూ 20 శాతం చార్జీల‌ను త‌గ్గించారు.

శుక్ర‌వారం, ఆదివారం మిన‌హా మిగిలిన రోజుల్లోనే చార్జీ త‌గ్గింపు అమ‌లులో ఉంటుంద‌ని అధికారులు ప్ర‌క‌టించారు.

Advertisement
అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

తాజా వార్తలు