CM Jagan : మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకే ఈబీసీ నేస్తం..: సీఎం జగన్

నంద్యాల జిల్లాలో సీఎం జగన్( CM Jagan ) పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఈబీసీ నేస్తం పథకం( EBC Nestham Scheme ) నిధులను ఆయన విడుదల చేశారు.

అర్హులైన అక్కాచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.15,000 చొప్పున సీఎం జగన్ జమ చేశారు.ఈ క్రమంలోనే మొత్తం 4,19,853 మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.629.37 కోట్లను వైసీపీ ప్రభుత్వం జమ చేసింది.ఈబీసీ నేస్తం పథకం నిధులను విడుదల చేసిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ

మహిళలకు ఆర్థిక చేయూత కల్పించేందుకే ఈబీసీ నేస్తం పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు.పేదవారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం జగన్ పేదరికంతో మహిళలు ఇబ్బందులు పడొద్దని సూచించారు.ఈ క్రమంలోనే ఈబీసీ నేస్తం కింద రూ.1,877 కోట్లు మహిళల ఖాతాల్లో వేశామన్నారు.ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకుంటున్నామన్న సీఎం జగన్ 58 నెలల్లో ఇంటి వద్దకే సేవలు అందించామని తెలిపారు.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable