జగన్ పై కోపం తో... అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరావు 

గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఏబీ వెంకటేశ్వరరావు పై అప్పట్లోనే వైసిపి ఎన్నో విమర్శలను చేసింది.

అయినా ఆయనకు ప్రాధాన్యం ఇస్తూనే అప్పటి సీఎం చంద్రబాబు వ్యవహరించారు.

టిడిపి ప్రభుత్వం కొనసాగినంత కాలం ఇంటెలిజెన్స్ చీఫ్ గా వెంకటేశ్వరరావు వ్యవహరించారు.చంద్రబాబును వెనకుండి.

నడిపించింది ఆయనే అనే విమర్శలను ఎదుర్కొన్నారు . వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు ఇబ్బందులు మొదలయ్యాయి.ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు మూడేళ్లపాటు ఏ పదవి లేకుండా ఖాళీగా ఉంచారు.

దీనిపై ఆయన కోర్టులో న్యాయపోరాటం చేసి చివరకు ఉద్యోగ బాధ్యతల్లో చేరారు.అలా చేరిన కొద్ది రోజుల్లోనే ప్రభుత్వంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని , ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ను ఆయన ఉల్లంఘించారని,  వివిధ కారణాలు చూపిస్తూ ఏపీ ప్రభుత్వం మరోసారి ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

Advertisement

దీని తరువాత ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఏపీ ప్రభుత్వం పైన సీఎం జగన్ పైన పరోక్షంగా విమర్శలు చేశారు.దుర్మార్గుడైన రాజు కింద పని చేయడం కంటే , అడవికి వెళ్లి వ్యవసాయం చేసుకోవడం మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.

అన్నట్లుగానే రెండోసారి సస్పెన్షన్ తర్వాత ఆయన పొలం బాట పట్టారు. వ్యవసాయం చేసుకుంటున్న ఫోటోలు బయటకు వచ్చాయి.

దీంతో  ఏబీ వెంకటేశ్వర రావు అన్నంత పనీ చేశారు.ఈయనకు ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉంది.

అంటే వైసిపి అధికారంలో ఉన్నంత కాలం ఈయనకు సర్వీసు ఉంది.వైసిపి ప్రభుత్వం ఉన్నంతకాలం ఏబీ వెంకటేశ్వరావు ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained

ఏబీ వెంకటేశ్వర రావు రిటైర్మెంట్ తరువాత టీడీపీ లో చేరి వైసీపీ టార్గెట్ గా పని చేయబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement