ఆ విషయంలో రూల్స్ పాటించని అమీర్ ఖాన్...అదేంటంటే?

ప్రస్తుత కరోనా పరిస్థితులలో ప్రజలకు అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, ప్రజలలలోకి ఎక్కువగా తీసుకెళ్ళే సత్తా ఉన్న సెలెబ్రెటీలతోనే ప్రభుత్వాలు .

ప్రజాప్రయోజన సంబంధిత విషయాలను తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాయి.

కాని అప్పుడప్పుడు సెలెబ్రెటీలు ప్రవర్తించే తీరు పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది.ప్రజలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పాల్సిన సెలెబ్రెటీలు తమ చర్యలతో విమర్శల పాలవుతుంటారు.

Aamir Khan Playing Cricket With Kids Without Mask, Mumbai, Aamir Khan, Covid R

తాజాగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు.కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించకుండా ముంబైలో మాస్కు లేకుండా పిల్లలతో క్రికెట్ ఆడిన వీడియోను బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ వైరల్ భయాని పోస్ట్ చేశాడు.

అయితే ఈ వీడియోలో గ్రౌండ్ లో తన మాస్కును తీసివేస్తున్న దృశ్యం ఇప్పుడు వైరల్ గా మారింది.అయితే దీనిపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కిష్వర్ మర్చెంట్ ఆ వీడియోలో ఉన్న ఎవరూ మాస్క్ పెట్టుకోలేదు, అందులో ఉన్నది ఎవరు, ఎందుకు మాస్కు పెట్టుకోలేదని సెటైరికల్ గా కామెంట్ చేశాడు.

Advertisement

అయితే అమీర్ ఖాన్ వీడియోపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన అమీర్ ఖాన్ ఇలా కోవిడ్ ప్రోటోకాల్ ను ధిక్కరించడం భావ్యం కాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal
Advertisement

తాజా వార్తలు