సెకన్లలోనే ఆటోను కారుగా మార్చేసిన యువకుడు.. వీడియో వైరల్!

ఇంటర్నెట్లో క్రియేటివ్ వీడియోలకు కొదవలేదు.సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే ఎందరో క్రియేటివ్ పీపుల్ వెలుగులోకి వచ్చారు.

అయితే తాజాగా ఒక ఆటో డ్రైవర్ ( Auto driver )తన అద్భుతమైన సృజనాత్మకతను చూపించి అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నాడు.ఈ వ్యక్తి తన ఆటో( Auto )ను చాలా సుందరంగా మార్చాడు.

అంతేకాదు దానిని క్షణాల్లోనే కారుగా( car ) మార్చేశాడు.సాధారణంగా మనం కారులో మాత్రమే రూఫ్ టాప్ అనేది ముడుచుక పోవడం చూస్తుంటాం.

సరిగ్గా అలాంటి రూఫ్‌ టాప్‌నే తన ఆటలో అందించాడీ డ్రైవర్.ఈ మాడిఫైడ్ ఆటో చూసేందుకు పింక్ కలర్ లో చాలా ఆకర్షణంగా కనిపించింది.

Advertisement

అతడు ఒక బటన్ నొక్కగానే సదరు ఆటో రూఫ్ టాప్ వెంటనే వెనక్కి ముడుచుకు పోయింది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అంటే ఇదే మరి అని చాలామంది అతడిని తెగ పొగిడేస్తున్నారు.ఈ ఆటో లోపల సీట్లు కూడా చాలా లగ్జరీగా కనిపించాయి.అవి పింక్, వైట్ కలర్‌లో ఆటో రంగుకు తగినట్లుగా భలే అట్రాక్టివ్ గా దర్శనమిచ్చాయి.

మొత్తంగా ఇందులో ప్రయాణించే వారికి మంచి అనుభూతి కలుగుతుందని చెప్పవచ్చు.అయితే ఈ క్రియేటివ్ పర్సన్ ఏ రాష్ట్రానికి చెందిన వాడు అనేది తెలియ రాలేదు.

ఇకపోతే ఈ వీడియోకు ఇప్పటికే 80 వేల వరకు లైకులు, లక్షల్లో వ్యూస్ వచ్చాయి.కొందరు దీనిని ది రోల్స్ రాయిస్ ఆఫ్ ఆటో అని పిలుస్తుండగా, మరికొందరు దీనిని ఆటో కూపర్, ఏ క్లాస్ ఆటో, ది కన్వర్టిబుల్ ఐ కెన్‌కానిస్ట్, బుగ్గటి ఫెయిల్స్ అని పిలుస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Advertisement

తాజా వార్తలు