ఎన్నికల విధులు నిర్వహిస్తూ పోలింగ్ కేంద్రంలో మరణించిన ఉపాధ్యాయుడు..!!

అనేక ఆటంకాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

స్టేట్ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ మొదట హైకోర్టు సింగిల్ జడ్జి స్టే విధించగా.

అటూ ఇటూ కాకుండా అధికారులు ఎన్నికల నిధుల విషయంలో నిన్నటి సాయంత్రం వరకు ఏం చేయలేని పరిస్థితి.సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును స్టేట్ ఎన్నికల కమిషన్ మరియు ప్రభుత్వ డివిజనల్ బెంచ్ వద్ద సవాల్ చేస్తూ తమ వాదనలు వినిపించడం తో నిన్న సాయంత్రం పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికి.

A Teacher Who Died While Performing Election Duties At A Polling Station Andhra

హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం తెలిసిందే.దీంతో చాలా ఉద్రిక్తత వాతావరణం మధ్య జరిగిన ఈ పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఇలాంటి తరుణంలో గుంటూరు జిల్లా అల్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న కోటేశ్వర రావు అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.వెంటనే సహచర సిబ్బంది మరియు పోలింగ్ కేంద్రం వద్ద పని చేస్తున్న అధికారులు హుటాహుటిన ఆయనను హాస్పిటల్ కి తరలించగా మార్గం మధ్యలోనే ఆయన మరణించడం జరిగింది.

Advertisement

 .

జాయింట్ పెయిన్స్‌తో బాధ‌ప‌డుతున్నారా..అయితే ఇవి తీసుకోవాల్సిందే.!
Advertisement

తాజా వార్తలు