వింటర్ లో ముఖ చర్మాన్ని స్మూత్ అండ్ బ్రైట్ గా మెరిపించే సింపుల్ చిట్కా మీకోసం!

ప్రస్తుత వింటర్ సీజన్ లో వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల కారణంగా తేమ త‌గ్గిపోయి చర్మం తరచూ పొడిగా మరియు నిర్జీవంగా మారిపోతుంటుంది.

ఫలితంగా ముఖంలో కాంతి తగ్గుతుంది.

పైగా చర్మం పొడిగా మారడం వల్ల చికాకు, దురద వంటివి తీవ్రంగా సతమతం చేస్తుంటాయి.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాను పాటిస్తే కనుక వింటర్ లో మీ ముఖ చర్మం స్మూత్ అండ్ బ్రైట్ గా మెరిసిపోవడం ఖాయం.

మరి ఇంతకీ ఆ సింపుల్ చిట్కా ఏంటి అనేది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, ఒక కప్పు వాటర్ వేసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో బియ్యాన్ని వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే అర కప్పు గింజ తొలగించి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, ఒక ఆరెంజ్ పండు తొక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు నీరు తొలగించిన పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఏదైనా బ్ర‌ష్ సహాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం చర్మాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ సింపుల్ చిట్కాను గనుక పాటిస్తే డ్రై స్కిన్ అన్నమాట అన‌రు.చర్మం స్మూత్ అవుతుంది.

అలాగే డల్ స్కిన్ బ్రైట్ అండ్ గ్లోయింగ్ గా మారుతుంది.పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయటపడటానికి సైతం ఈ చిట్కా ఉపయోగపడుతుంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

కాబట్టి తప్పకుండా ఈ చిట్కాను ట్రై చేయండి.చ‌ర్మాన్ని అందంగా మెరిపించుకోండి.

Advertisement

తాజా వార్తలు