'వారాహి విజయ యాత్ర' కి నెల రోజులు బ్రేక్..భారీ గా తగ్గిపోయిన 'జనసేన' గ్రాఫ్!

మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం వారాహి విజయ యాత్ర( Varahi Yatra ) కి ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ వైఫల్యాలను ఊహించని రీతిలో ఎత్తి చూపాడు.

జనాల్లో ఈ పార్టీ ఇంత అవినీతికి పాల్పడిందా అని ఆశ్చర్యపోయేలా చేసాడు.ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ విరుచుకుపడిన తీరు, ఆ వ్యవస్త ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కోట్లాది మందికి సంబంధించిన డేటా చోరీ ఎలా చేస్తుంది, ఆ డేటా చోరీ వల్ల ఎలాంటి నష్టాలు వచ్చాయి, హ్యూమన్ ట్రాఫికింగ్ కి అది ఎలా తోడ్పడింది, ఇలాంటి విషయాలను ఆధారాలతో సహా బయటపెట్టి వైసీపీ పార్టీ పరువు తీసాడు.

అప్పటి నుండి ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్స్ పట్ల, వాళ్లకి డేటా ఇవ్వడం పట్ల జనాలు ఆలోచించడం మొదలు పెట్టారు.

A Month Break For Varahi Vijaya Yatra Graph Of Janasena Has Reduced Drasticall

అంతే కాదు, ఆంధ్ర ప్రదేశ్ లో అనేక సమస్యలు ఈ వారాహి విజయ యాత్ర లో కోట్లాది మంది తెలుగు ప్రజలకు తెలిసేలా చెయ్యడం లో పవన్ కళ్యాణ్ గ్రాండ్ సక్సెస్ అయ్యాడు.ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యాత్ర వైసీపీ పార్టీ ని క్షేత్ర స్థాయి నుండి క్యాడర్ మొత్తం వణికిపోయేలా చేసింది.అలాంటి యాత్ర ఇప్పుడు నెల రోజు నుండి ఆగిపోయింది.

Advertisement
A Month Break For Varahi Vijaya Yatra Graph Of Janasena Has Reduced Drasticall

సెప్టెంబర్ 5 వ తారీఖున కృష్ణ జిల్లాలో ప్రారంభించిన ఈ యాత్ర కేవలం 5 రోజులు మాత్రమే జరిగింది.అనంతరం చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Naidu arrest ) అవ్వడం, పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీ తో పొత్తు ప్రకటించడం ఇవన్నీ జరిగాయి కానీ, వారాహి యాత్ర మాత్రం తిరిగి ప్రారంభం కాలేదు.

జనసేన పార్టీ గ్రాఫ్ ని ఒక రేంజ్ లో పెంచిన ఈ యాత్ర ఇలా నెల రోజుల నుండి స్తబ్దుగా నిలిచిపోవడం తో అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది.

A Month Break For Varahi Vijaya Yatra Graph Of Janasena Has Reduced Drasticall

మరోపక్క పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయించడానికి సిద్ధం అయ్యాడు.బీజేపీ పార్టీ తో పొత్తు పెట్టుకొని 11 స్థానాల్లో పోటీ చేయబోతుంది జనసేన.కాబట్టి ఎన్నికల ప్రచారం లో పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువ ఉండడం తో, ఆయన ఆంధ్ర ప్రదేశ్ లో వారాహి విజయ యాత్ర కి ఈ నెల కూడా బ్రేక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

ఇలా ఆంధ్ర లో ఇన్ని రోజులు బ్రేక్ ఇవ్వడం వల్ల జనసేన గ్రాఫ్ బాగా తగ్గిపోయిందని, మళ్ళీ ఈ యాత్ర కి మునుపటి వైభవం వస్తుందో లేదో అని రాజకీయ విశ్లేషకులు సందేహం ని వ్యక్త పరుస్తున్నారు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు