Hill Rocks 400 Steps : కొండపై ఉన్న దేవాలయం కోసం ఈ పని చేసి పుణ్యం చేసుకున్న వ్యక్తి.. అందరికీ సాధ్యం కాదు..

మన దేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాలకు ప్రతిరోజు భక్తులు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.

కొన్ని దేవాలయాలకు రహదారులు, మెట్లు కూడా సరిగ్గా లేవు.అలాంటి దేవాలయాలకు కూడా భక్తులు వెళ్లి పూజలు, పునస్కారాలు చేస్తూనే ఉంటారు.

అంతేకాకుండా భగవంతుని కోసం భక్తులు హుండీలో కానుకలు వేసి వస్తూ ఉంటారు.కానీ ఒక వ్యక్తి మాత్రం భగవంతుని కోసం వచ్చే భక్తుల కు ఎలాంటి సమస్యలు రాకూడదని 400 మెట్లు కొండపై ఉన్న దేవాలయానికి నిర్మించాడు.

నిర్మించడం అంటే ఏదో డబ్బులు ఇచ్చి కూలీలతో పని చేయించాడని కాదు అతనే స్వయంగా కొండ రాళ్లను ఉల్లితో చెక్కి మెట్ల గా మార్చాడు.బీహార్ రాష్ట్రంలోని గాయ జిల్లాకు చెందిన దశరథ మంజుకి దగ్గర డబ్బు, అధికారం లేదు.

Advertisement
A Man Who Did This Work For The Temple On The Hill ,temple Hill , Ancient Templ

కానీ తన భార్య కోసం 300 అడుగుల ఎత్తున ఉన్న కొండను తవ్వి రహదారిని నిర్మించాడు.ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అలాంటి సాహసమే చేశాడు గనోరి పాశ్వాన్.

భక్తుల కష్టాలను చూడలేక 1500 అడుగుల ఎత్తులో కొండపై ఉన్న దేవాలయం కోసం దాదాపు 400 మెట్లు చేక్కాడు.రాతి మనలను కేవలం సుత్తి, ఉల్లితో తొలగిస్తూ మెట్లను నిర్మించుకుంటూ వెళ్ళాడు.

ఈ వ్యక్తికి ఈ మెట్లన్నీ చెక్కడానికి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు పట్టింది.

A Man Who Did This Work For The Temple On The Hill ,temple Hill , Ancient Templ

జహానాబాద్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనువార్య గ్రామంలోని కొండపై యోగేశ్వర్నాథ్ దేవాలయం ఉంది ఆ దేవాలయానికి వెళ్ళడానికి భక్తులకు గంటల సమయం పట్టేది కొండ ఎక్కుతున్నప్పుడు పదునైన రాళ్లు గుచ్చుకొని చాలామంది భక్తులకు గాయాలు కూడా అయ్యాయి గుడికి చేరడానికి ఈ మహిళలకు ఇంకా ఎంతో కష్టంగా ఉండేది దీంతో యోగేశ్వర్నాథ్ దేవాలయానికి వెళ్లే భక్తులు సురక్షితంగా ఆలయానికి చేరుకునేలా ఒక మార్గాన్ని ఒక వ్యక్తి నిర్మించాలనుకున్నాడు అలా 2014లో పని మొదలుపెట్టి దాదాపు 390 మెట్లు ఉల్లితో చెక్కాడు.ఈ పని చేయడానికి నాకు ఎక్కడా లేని ఓపిక శక్తి వచ్చేవి.ఇది నాకు ఎప్పుడు కష్టంగా అనిపించలేదు.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఆలయం పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందాలని నేను ఎప్పుడూ కోరుకుంటానని ఈ వ్యక్తి వెల్లడించాడు.

Advertisement

తాజా వార్తలు