Hippo Hyena : హిప్పో దాడి నుంచి రెప్పపాటులో తప్పించుకున్న హైనా.. వీడియో చూస్తే..

ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ అయ్యే అడవి జంతువుల వీడియోలను చూసి చాలామంది బాగా ఎంజాయ్ చేస్తారు.

అడవి జంతువుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ వీడియోల ద్వారా తెలుసుకోగలుగుతారు.

అంతేకాదు ఈ వీడియోలు సస్పెన్స్, థ్రిల్లింగ్, వైలెన్స్, లవ్ వంటి రకరకాల ఫీలింగ్స్ తో సినిమా సన్నివేశాలను తలపిస్తుంటాయి.ముఖ్యంగా ఒక జంతువు మరొక జంతువును వేటాడేటప్పుడు అవి చాకచక్యంగా తప్పించుకునే వీడియోలు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి.

తాజాగా అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో ఒక హైనా( Hyena ) నీటిలో హాయిగా పడుకున్న హిప్పోని డిస్టర్బ్ చేసింది.ఇది గమనించిన హిప్పో సెకన్ల సమయంలోనే పైకి లేచి హైనాని వెంబడించడం ప్రారంభించింది.

ఈ భయానక ప్రవర్తనతో హైనాకి గుండెలు జారిపోయాయి.ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను @safari.

Advertisement

travel.ideas అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేసింది.

ఈ వీడియో టాంజానియా( Tanzania )లో అనేక రకాల జంతువులు నివసించే న్గోరోంగోరో క్రేటర్ అనే ప్రదేశంలో షూట్ చేశారు.నీటిలో హాయిగా సేదతీరుతున్న హిప్పోకి దగ్గర హైనా నడుచుకుంటూ వస్తున్నట్లు వీడియోలో మనం చూడవచ్చు.హైనా హిప్పో చనిపోయిందని భావించి దానిని కొరుక్కు తిందామని ప్రయత్నిస్తుంది.

కానీ హిప్పో చనిపోలేదు, అది నిద్రపోతోంది.హైనా తగలగానే వెంటనే లేచిన హిప్పో( Hippo ) కోపంతో రగిలిపోయింది, అది వెనక్కి తిరుగుతూ హైనాని వెంటాడుతుంది.

హైనా పారిపోతుంది, కానీ హిప్పో నీటిలో చాలా వేగంగా దూసుకు వస్తుంది.హిప్పో హైనాను పట్టుకుని కొరికి చంపేయడానికి ప్రయత్నిస్తుంది.

నైట్‌ నిద్రించే ముందు ఇలా చేస్తే.. వేక‌ప్ అద్భుతంగా ఉంటుంది!

కానీ హైనా చాలా వేగంగా నీటిలో నుంచి బయటపడి పారిపోతుంది.ఆ విధంగా ప్రాణాలను రక్షించుకుంటుంది.

Advertisement

ఈ వీడియోకు 80 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.హిప్పోలు మాంసం తినకపోయినా చాలా ప్రమాదకరమైన జంతువులు అని వీడియో పోస్టుపై కొందరు వ్యాఖ్యానించారు.

హిప్పోలు నీటిలో చాలా త్వరగా కదులుతాయని కూడా వారు చెప్పారు.

తాజా వార్తలు