రెండు నెలలు బ్రేక్ లేకుండా 1200 కి.మీ ప్రయాణించిన పిల్లి.. చివరికి..?

మనుషులే కాదు జంతువులు కూడా వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి.

సాధారణంగా అడవి జంతువులు ఎక్కువ దూరాలు ప్రయాణాలు చేస్తుంటాయి అయితే కొన్నిసార్లు పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కలు(bog, cat) కూడా వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయి.

తప్పిపోయినప్పుడు యజమానులను కలుసుకోవడానికి ఇవి ఇలా పెద్ద సాహస యాత్రలు చేపడతాయి.చివరికి ఓనర్లను కలుసుకుని తమ కథను సుఖాంతం చేసుకుంటాయి.

తాజాగా అలాంటి ఒక డేరింగ్, అడ్వెంచరస్‌ పిల్లికి సంబంధించిన స్టోరీ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.వివరాల్లోకి వెళితే, కాలిఫోర్నియా(California) రాష్ట్రంలోని సాలినాస్‌కు చెందిన సుసాన్, బెన్నీ అంగుయానో దంపతులు కొద్ది రోజుల క్రితం యెల్లోస్టోన్ నేషనల్ పార్క్‌కు (Yellowstone National Park)వెళ్లారు.

ఆ పార్క్‌కు తమ పిల్లి రేన్ బ్యూను కూడా తీసుకెళ్లారు.దీని వయసు రెండేళ్లు.

Advertisement
A Cat That Traveled 1200 Km Without A Break For Two Months.. Finally, Rayne Beau

ఇది సియామీ జాతికి చెందినది.అయితే, ఆ పార్క్‌ దగ్గర ఆడుకుంటూ పిల్లి తప్పిపోయింది.

పిల్లి పోయిన మొదటి రోజు నుంచి బెన్నీ అడవి అంతా తిరిగి పిల్లిని వెతుకుతూ ఉన్నాడు.అయితే రెండు నెలల తర్వాత పిల్లి తనంతటతానే 1200 కిలోమీటర్ల(1200 km) దూరం ప్రయాణించి ఇంటికి చేరుకుని ఆశ్చర్యపరిచింది.

పిల్లి శరీరంలో అమర్చిన మైక్రోచిప్ ద్వారా అది తమ పిల్లే అని యజమానులు గుర్తించారు.

A Cat That Traveled 1200 Km Without A Break For Two Months.. Finally, Rayne Beau

సుసాన్, బెన్నీ(Susan, Benny) పిల్లికి ఇష్టమైన వస్తువులు, ఆహారం ఇచ్చి దానిని పార్కు అడవి నుంచి తీసుకురావాలని ప్రయత్నించారు కానీ ఫెయిల్ అయ్యారు.పిల్లి వాడికి దూరంగా అడవిలోకి వెళ్లిపోయింది అందులోకి వెళ్లడం ప్రమాదం కాబట్టి వారు పిల్లిని వదిలి వెళ్ళాల్సి వచ్చింది.సుసాన్ తన పిల్లిని కోల్పోవడం చాలా బాధగా భావించారు.

హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్

రేన్ బ్యూ తప్పిపోయిన తర్వాత ఒక నెలకు, ఆ కుటుంబం మరో పిల్లిని ఆశ్రయం నుంచి తీసుకువచ్చారు.

A Cat That Traveled 1200 Km Without A Break For Two Months.. Finally, Rayne Beau
Advertisement

రేన్ బ్యూ తప్పిపోయిన 61 రోజుల తర్వాత, ఆ కుటుంబానికి ఒక వార్త తెలిసింది.రేన్ బ్యూ కనిపించిందనేది ఆ వార్త సారాంశం.రేన్ బ్యూను రోస్‌విల్లె అనే ప్రదేశంలో కనుగొన్నారు.

అక్కడ దానిని ఒక జంతు సంరక్షణ సంస్థ దగ్గరకు తీసుకెళ్లారు.ఆ సంస్థ అధ్యక్షురాలు లైలాని ఫ్రాటిస్ ఈ విషయాన్ని ధృవీకరించారు.

జంతు సంరక్షణ సంస్థ అధ్యక్షురాలు లైలాని ఫ్రాటిస్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులకు మైక్రోచిప్ అమర్చాలని కోరారు.రేన్ బ్యూను(Rayne Beaunu) కనుగొన్న మహిళ అది చాలా అనారోగ్యంగా ఉందని అన్నారు.

ఆమె కొన్ని రోజులు తన ఇంట్లోనే చూసుకున్నారు.ఆ తర్వాత జంతు సంరక్షణ సంస్థకు తీసుకెళ్లారు.

సుసాన్ మాట్లాడుతూ, రోస్‌విల్లెలో రేన్ బ్యూను (Rayne Beaunu)కనుగొన్న మహిళను తాము సంప్రదించామని తెలిపారు.రేన్ బ్యూ వైయోమింగ్ నుంచి కాలిఫోర్నియా రాష్ట్రంలోని రోస్‌విల్లె వరకు, ఆ తర్వాత సాలినాస్ వరకు 1000 మైళ్లకు పైగా ప్రయాణించిందని తెలిపారు.రేన్ బ్యూ ఎలా కాలిఫోర్నియాకు చేరుకుందో తమకు తెలియదని, అతను ఇంటికి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నామని అంగుయానో దంపతులు తెలిపారు.

తాజా వార్తలు